హైదరాబాద్ : బంజారాహిల్స్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. బ్రీత్ అనలైజర్ టెస్టులో 94 పాయింట్లు నమోదు కావడంతో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆ యువకుడు ట్రాఫిక్ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు.
తాను హైకోర్టు లాయర్‌ను.. తనకు హైకోర్టు జడ్జి తెలుసంటూ రెచ్చిపోయాడు. నీకు సెక్షన్లు తెలుసా? ఐపీసీ సెక్షన్ 123 కింద నీపై కేసు ఫైల్ చేస్తానంటూ హెచ్చరిస్తూ ట్రాఫిక్ ఎస్ఐని కాలితో తన్నాడు. దీంతో ఆ యువకుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ యువకుడి పక్కన ఉన్న యువతి సైతం ఎక్కడా తగ్గలేదు. వీడియోలు తీస్తారా? మీకు సిగ్గు లేదా? అంటూ రెచ్చిపోయింది. అయితే పోలీసులపై ఆ స్థాయిలో రెచ్చిపోయిన యువకుడిని ఆహా ఓటీటీలో పనిచేస్తున్న గౌరవ్గా గుర్తించారు.