శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 16, 2020 , 17:43:43

5 అడుగుల మొసలి పట్టివేత

5 అడుగుల మొసలి పట్టివేత

వడోదర : గుజరాత్ వడోదర జిల్లా రాజ్‌మహల్ రోడ్డులోని నివాస ప్రాంతాల్లోకి వచ్చిన 5 అడుగుల ముసలిని ఆదివారం గుజరాత్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు ఎనిమల్స్ (జీఎస్‌పీసీఏ) వాలంటీర్లు బందించారు. ఉదయం కాలనీలోని పబ్లిక్ బెంచ్ కింద ముసలిని గుర్తించిన స్థానికులు జీఎస్‌పీసీఏ సంస్థకు కాల్‌ చేశారు. వెంటనే సంస్థ ప్రతినిధులు ఇద్దరు వాలంటీర్లను అక్కడికి పంపారు. వారు అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేసి ముసలికి ఎలాంటి హాని కలగకుండా బందించారని జీఎస్‌పీసీఏ వ్యవస్థాపకుడు రాజ్ భావ్సర్ తెలిపారు. వర్షాలకు అడవి జంతువులు నివాస ప్రాంతాల్లోకి వస్తే తమ సంస్థ హెల్ప్‌లైన్ నంబర్లు 9825011117, 9825711118లకు ఫోన్‌ చేయాలని కోరారు. వాటికి ఎలాంటి హాని జరుగకుండా పట్టుకొని సురక్షితంగా అటవీ ప్రాంతాలకు తరలిస్తామని ఆయన తెలిపారు.


logo