సుమిత్ర మహాజన్ చనిపోయారంటూ పుకార్లు.. కేసు నమోదు
లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ కరోనా వైరస్‌కు గురై చనిపోయారంటూ సోషల్ మీడియాలో పుకార్ల వార్తలు షికార్లు చేశాయి

ఇండోర్ : లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ కరోనా వైరస్‌కు గురై చనిపోయారంటూ సోషల్ మీడియాలో పుకార్ల వార్తలు షికార్లు చేశాయి. మాజీ కౌన్సిలర్ సుధీర్ డెడ్జ్ ఫిర్యాదు మేరకు సరాఫా పోలీస్ స్టేషన్ అధికారులు గుర్తు తెలియని వ్యక్తిపై సెక్షన్ 188 కింద కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని న్యూస్ ఛానెల్స్ కూడా తప్పుడు వార్తలను ప్రసారం చేశాయి.
జ్వరం రావడంతో సుమిత్ర మహాజన్ ఇండోర్‌లోని బొంబాయి ఆసుపత్రిలో చేరారు. ఆమెకు కరోనా నెగెటివ్‌గా తేలింది. కానీ వైద్యులు ఇంకా ఆమెను దవాఖాన నుంచి డిశ్చార్జీ చేయలేదు. ఆమెకు ఇతర ఆరోగ్య పరీక్షలు కూడా జరుపుతున్నట్లు దవాఖాన యాజమాన్యం తెలిపింది. సోషల్ మీడియాలో సుమిత్ర మహాజన్ చనిపోయారంటూ పుకార్లు షికార్లు చేయడంతో మాజీ కౌన్సిలర్ సుధీర్ డెడ్జ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే సుమిత్ర మహాజన్ కుటుంబంలోని ఇద్దరు సభ్యులు కరోనా బారిన పడ్డారు.
తనపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాయడం పట్ల సుమిత్ర మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే నన్నే నేరుగా అడగాల్సిందని, లేదంటే ప్రభుత్వాన్ని తెల్సుకుని వార్తలు రాయాల్సి ఉన్నదన్నారు. ఏదేమైనా ఇలాంటి వార్త తన వయసును పెంచిందని సుమిత్ర మహాజన్ వ్యాఖ్యానించారు.
ఇలాఉండగా, ఈ తప్పుడు వార్తలను బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయవర్గియా తీవ్రంగా ఖండించారు. సుమిత్ర మహాజన్ ఆరోగ్యంగా ఉన్నారంటూ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
రెమ్‌డెసివిర్‌కు బదులుగా నీళ్ల ఇంజెక్షన్.. రోగి మృతి
క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చరిత్రలో ఈరోజు
ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకుల రుణాలు.. ఎందుకంటే?!
కరోనా మహమ్మారి నుంచి పల్లెలు పదిలం : ప్రధాని పిలుపు
ఆక్సిజన్ సరఫరా అడ్డుకున్న వాళ్లను ఉరితీస్తాం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

