ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకుల రుణాలు.. ఎందుకంటే?!
ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకుల రుణాలు.. కరోనా వేళ ఆదాయాలు కోల్పోయి నగదు కొరత సమస్యను ఎదుర్కొంటున్న వారికి బ్యాంకులు రిలీఫ్ కల్పిస్తున్నాయి.. ఫిక్స్ డ్ ...

న్యూఢిల్లీ: కరోనా వల్ల చాలా మంది తమ ఆదాయం కోల్పోయి ఉంటారు. అటువంటి వారందరికీ డబ్బు సమస్య ఎదురవుతుంది. మీరు కూడా అలా సమస్యలు ఎదుర్కొంటున్నట్లైతే.. వాటిని అధిగమించడానికి మీరు బ్యాంకులో చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లపై రుణం తీసుకోవచ్చు. పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు ఫిక్స్డ్ డిపాజిట్లపై తక్కువ వడ్డీకే రుణాలిస్తున్నాయి. పర్సనల్ లోన్లపై కంటే తక్కువ ఆరు శాతం లోపు వడ్డీకే ఎఫ్ డీలపై రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఏయే బ్యాంకులో ఏ మేరకు వడ్డీ మీద ఎఫ్డీలపై రుణాలిస్తున్నారో తెలుసుకుందాం..
మీరు ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ మీద రుణం తీసుకుంటే, సదరు ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ కంటే 1-2 శాతం ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ మీద నాలుగు శాతం వడ్డీ పొందుతున్నారనుకోండి.. దానిపై తీసుకున్న రుణానికి 6 శాతం వడ్డీ చెల్లించాలి.
మీ ఫిక్స్డ్ డిపాజిట్ మొత్తంలో 90 శాతం వరకు రుణం తీసుకోవచ్చు. మీరు రూ.1.5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకుందాం.. అప్పుడు మీరు రూ.1.35 లక్షల వరకు రుణం పొందొచ్చు.
దేశంలోనే అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఎస్బీఐతోపాటు పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు ఈ ఫెసిలిటీ కలిగిస్తున్నాయి. దీని ప్రకారం మీరు రుణం తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లొచ్చు. ఇది సురక్షితమైంది కావడంతోపాటు తేలిగ్గా లభించే రుణం.
బ్యాంకులు ఆఫర్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ.. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ల రుణాలపై చెల్లించాల్సిన వడ్డీ చూద్దాం..
బ్యాంకు- రుణం వడ్డీరేటు (%)- గరిష్ఠ రుణం
ఎస్బీఐ- ఎఫ్ డీ వడ్డీరేటు ప్లస్ 1%- ఎఫ్డీలో 90%
పంజాబ్ నేషనల్ బ్యాంక్- ఎప్డీ వడ్డీ ప్లస్1%-ఎఫ్డీలో 95%
యాక్సిస్ బ్యాంక్- ఎఫ్డీ వడ్డీరేటు ప్లస్2%-ఎప్డీలో 85%
హెచ్డీఎఫ్సీ బ్యాంక్- ఎఫ్డీ వడ్డీరేటు ప్లస్2%-ఎఫ్డీలో 90%
బ్యాంక్ ఆఫ్ బరోడా- ఎఫ్డీ వడ్డీరేటు ప్లస్2%- ఎఫ్డీలో 90%
ఇండియన్ బ్యాంక్ – ఎఫ్డీ వడ్డీరేటు ప్లస్2%-ఎఫ్డీలో 90
ఐసీఐసీఐ బ్యాంకు- ఎఫ్డీ వడ్డీరేటు ప్లస్ 2-3%- ఎఫ్డీలో 90%
ఇవి కూడా చదవండి:
ఆక్సిజన్ సరఫరా అడ్డుకున్న వాళ్లను ఉరితీస్తాం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు
క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చరిత్రలో ఈరోజు
స్టీల్ ప్లాంట్ల నుంచి 1.43 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాలు!
ఆక్సిజన్ కు కటకట : అలాగైతే 24 గంటల్లో వ్యవస్థ కుప్పకూలుతుంది..
ఆక్సిజన్ కొరత.. ఆ దవాఖానలో కొత్త రోగులకు నో అడ్మిషన్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

