గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 02, 2020 , 15:52:11

మత్స్యకారుడి హత్యపై స్థానికుల ఆగ్రహం.. 20 పడవలకు నిప్పు

మత్స్యకారుడి హత్యపై స్థానికుల ఆగ్రహం.. 20 పడవలకు నిప్పు

చెన్నై: తమిళనాడులో ఒక మత్స్యకారుడు శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు. దీంతో ఆగ్రహించిన అతడి మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. ప్రత్యర్థులకు చెందిన 20 పడవలు, రెండు బైకులు, కార్లకు నిప్పుపెట్టారు. వారి ఇండ్లపై దాడి చేసి ధ్వంసం చేశారు. తజంగూడ మాజీ పంచాయతీ అధ్యక్షుడు మసీలమణి సోదరుడు మడివానన్ (36), శనివారం రాత్రి బైక్‌పై కడలూరు నుంచి గ్రామానికి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మాటువేసిన ప్రత్యర్థులు అతడిపై దాడి చేసి నరికి చంపారు. ఈ విషయం తెలిసిన వెంటనే మడివాసన్ అనుచరులు రెచ్చిపోయారు. ప్రత్యర్థులకు చెందిన 20 పడవలు, రెండు బైకులు, కార్లకు నిప్పుపెట్టారు. సుమారు పది ఇండ్లను ధ్వంసం చేశారు. ఈ దీంతో పోలీసులు ఇరు వర్గాలకు చెందిన 43 మందిని అరెస్ట్ చేశారు.

తజంగూడ పంచాయతీ ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడి మధ్య ఉన్న విభేదాలే మడివాసన్ హత్య, అనంతరం విధ్వంసానికి కారణమని పోలీసులు తెలిపారు. గుండు ఉప్పలవాడి పంచాయతీ అధ్యక్ష పదవికి మాడియాజగన్ భార్య శాంతి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి మసీలమణి భార్య ప్రవీణాను ఓడించారు. దీంతో ఏప్రిల్‌లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని, వారిపై కేసులు నమోదయ్యాయని పోలీసులు చెప్పారు.
logo