Marijuana | రైల్లో తరలిస్తున్న42 కిలోల గంజాయి స్వాధీనం.. వ్యక్తి అరెస్టు

మారేడ్పల్లి : రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నింధితుడి వద్ద నుంచి 8 లక్షల 40 వేల రూపాయల విలువచేసే 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రైల్వే డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ చంద్రభాను, ఇన్స్పెక్టర్ శ్రీనులు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా గొలంతార గ్రామానికి చెందిన బెహరా (40) స్థానికంగా చేపలు పట్టి కుటుంబాన్ని పోషిస్తు న్నాడు. చెడు అలవాట్లకు అలవాటు పడ్డ ఇతడు తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న కోరికతో గంజా యి అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇచ్చాపురం నుంచి కొణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో విశాఖపట్టణం వరకు వచ్చాడు.
అక్కడి నుంచి గురువారం ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైల్లో ముంబాయికి గంజాయిని తరలిస్తున్నాడు. రైలు సికింద్రాబాద్ చేరుకోగానే రైల్వే పోలీసులు తనిఖీలు చేస్తున్నట్లు గమనించి బెహరా పోలీసుల కళ్లుగప్పి ట్రైన్ దిగి తప్పించుకొని వెళ్లాడు. తిరిగి శుక్రవారం నిందితుడు ముంబాయి వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చాడు.
అప్పటికి ముంబాయి వెళ్లాల్సిన టైన్ వెళ్లిపోవడంతో తిరిగి స్టేషన్ నుంచి బయటకు వచ్చే క్రమంలో పోలీసుల కంట పడ్డాడు. అనుమానస్పదంగా కనపడడంతో అతని అదుపులోకి తీసుకున్న పోలీసులు తనిఖీ చేయగా..అతని వద్ద ఉన్న బ్యాగుల్లో 8.40 లక్షల విలువైన 42 కిలోల గంజాయి పట్టుబడింది.
నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితున్ని పట్టుకోవడంలో చాకచాక్యంగా వ్యవహరించిన ఎస్ఐ మాజీద్, సిబ్బంది రామచంద్రయ్య, జపాన్, హరిలాల్ తదితరులను అభినందించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

