నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ షాపింగ్ మాల్ వద్ద మూడేండ్ల చిన్నారి కిడ్నాప్‌కు గురైంది. మెట్‌పల్లికి చెందిన ఓ కుటుంబం.. శుక్రవారం మధ్యాహ్నం షాపింగ్ కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చింది. షాపింగ్ చేసిన అనంతరం బిల్లులు చెల్లిస్తున్న సమయంలో ఆ కుటుంబానికి చెందిన మూడేండ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.
చిన్నారి కిడ్నాప్‌పై పోలీసులకు బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్కడున్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. బురఖా ధరించిన మహిళలు చిన్నారిని అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. పాప ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.