న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఓ బహుళ అంతస్తులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో 21 కార్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సుభాష్ నగర్లో జరిగినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అయితే తెల్లవారుజామున ఆ భవనం సెల్లార్లో ఓ వ్యక్తి తిరుగుతున్నట్లు సీసీ ఫుటేజీలో లభ్యమైంది. తెల్లవారుజామున 4 గంటలకు తమకు సమాచారం అందడంతో.. ఆరు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 6:10 గంటలకు మంటలు అదపులోకి వచ్చాయన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. మొత్తం 21 కార్లు దగ్ధమయ్యాయని పేర్కొన్నారు. అయితే ఈ భవనానికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేదని ధృవీకరించారు.
मेरे वॉर्ड #SubhashNagar में सुबह 3 बजे के आस-पास किसी असामाजिक तत्व ने MCD की मल्टी लेवल कार पार्किंग में आग लगा दी जिसमें लगभग 30-35 गाड़ियाँ जलकर ख़ाक हो गई हैं।
मैं सुबह से ही मौक़े पर मौजूद हूं और दोषी को पकड़वाने के लिए हर संभव प्रयास कर रहा हूं pic.twitter.com/itbGV2wQ7U
— Aditya Goswami (@AdityaGoswami_) December 26, 2022