రంగారెడ్డి : మైలార్దేవుపల్లిలో ఓ ముగ్గురు వ్యక్తులు తుపాకీతో హల్చల్ సృష్టించారు. స్థానికంగా ఉన్న సరస్వతి నగల దుకాణంలోని ఆ ముగ్గురు దుండగులు ప్రవేశించారు. బంగారం కొనేవారిలా షాపు యజమాని దిలీప్‌తో మాటలు కలిపారు. దుండగుల్లో ఒకరు తుపాకీ బయటకు తీసి.. డబ్బులు ఇవ్వాలని యజమానిని బెదిరించాడు. దీంతో షాపులో ఉన్న సిబ్బంది గట్టిగా కేకలు వేశారు. షాపు బయట ఉన్న జనాలు అప్రమత్తమయ్యారు.
ముగ్గురు దుండగులు పారిపోతుండగా.. ఇదర్ని స్థానికులు పట్టుకున్నారు. మరొకరు పరారీ అయ్యాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దుండగుల వద్ద తుపాకీతో పాటు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగల స్వస్థలం రాజస్థాన్‌లోని ఖరియా నీవ్గా పోలీసులు గుర్తించారు.