జహీరాబాద్ : రంజాన్ పండుగ రోజు పేద ముస్లిం ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. జహీరాబాద్ పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఐడీఎస్ఎన్టీ కాలనీ సమీపంలోని హిందూ స్మశాన వాటికలో విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు యువకులు మృతి చెందారు. మహమ్మద్ మస్తాన్ పాషా(16), మహమ్మద్ అబ్దుల్లా (13) లు హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు.
రంజాన్ పండుగ నేపథ్యంలో ఆ ఇద్దరు జహీరాబాద్‌కు మూడు రోజుల క్రితం వచ్చారు. అదే రోజు బయటకు వెళ్లిన వారు.. ఇంటికి తిరిగి రాలేదు. అయితే మంగళవారం ఉదయం హిందూ స్మశాన వాటికలో ఉన్న మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇద్దరు మృతులను పాషా, అబ్దుల్లాగా పోలీసులు గుర్తించారు. పంచనామా నిర్వహించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.