ఖమ్మం : ఉరేసుకొని విద్యార్ధి బలవణ్మరణానికి పాల్పడ్డాడు. మండల పరిధిలో కోయచలక గ్రామానికి చెందిన పోతిన్ని తేజ(17) స్థానిన ప్రభుత్వ పాఠశాలలో10వ తరగతి చదువుతున్నాడు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనా తేజ పాఠశాలకు వెళ్లకపోవడంతో అతని తల్లి రాజేశ్వరి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్ధి తేజ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. మరొకరిలో తమ కొడుకును చూసుకోవాలనే ఆలోచనతో తేజ నేత్రాలను ఖమ్మం నేత్ర నిధికి దానం చేశారు.