శంషాబాద్ రూరల్ : గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైన సంఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సత్యకుమార్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బుర్జుగడ్డతండాకు వెళ్లే రోడ్డులో గుర్తుతెలియని మహిళ శవం పడి ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మహిళ ఒంటిపై గూలాబీ తెలుపు రంగు కలిగిన చీర, జాకెట్ ఉన్నాయి. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్ఠం నిమిత్తం నగరంలోని ఉస్మానియా దవాఖానకు తరలించిన ట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.