బచ్చన్నపేట, అక్టోబర్ 10 : పాముకు గురైన ఓ యువకుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బోనకొల్లూరు గ్రామంలో శుక్రవారం జరిగింది. మృతుని కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..దయ్యాల పద్మ, కనకయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. ఇందులో ఒక కూతురు వివాహం చేశాడు. కుమారుడు రాకేష్ (19) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటున్నాడు.
ఈనెల 4 న వ్యవసాయ బావి వద్ద ప్రమాదవశాత్తు రాకేష్ పాము కాటుకు గురయ్యాడు. అది పాము అని తెలియక గ్రామంలో జరిగే దుర్గామాత నిమజ్జనంలో పాల్గొని రాత్రివేళ అన్నం తిని పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం కాలు అంతా తిమ్మిర్లు వచ్చినట్టు ఉండగా గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. ఉన్న ఒకానొక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.