బెండకాయ.. ఓ కూరగాయగానే పరిచయం. తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని విన్నాం.. రకరకాల కూరలు వండుకొని తిన్నాం! మరి.. బెండకాయ నీటి గురించి విన్నామా? ఆ నీళ్లు ఆరోగ్యంతోపాటు అందానికి భరోసా ఇస్తాయని తెలుసా?
బెండకాయ.. ఓ కూరగాయగానే పరిచయం. తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని విన్నాం.. రకరకాల కూరలు వండుకొని తిన్నాం! మరి.. బెండకాయ నీటి గురించి విన్నామా? ఆ నీళ్లు ఆరోగ్యంతోపాటు అందానికి భరోసా ఇస్తాయని తెలుసా?
తయారీ విధానం
బెండకాయను బాగా కడిగి ముక్కలుగా కోయాలి.
వీటిని ఓ గ్లాసు తాగు నీటిలో వేసి, రాత్రంతా నానబెట్టాలి.
ఉదయాన్నే నీటిని వడగట్టి.. పరగడుపునే తాగాలి.
అనేక ప్రయోజనాలు
బెండకాయలో ఫైబర్ అధికం. అది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్.. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. హార్మోన్లను నియంత్రించడంతోపాటు కాలేయ ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి.
ఈ నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే.. శరీరంలోని విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి.
ఇందులో ఉండే విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్ చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి.
బెండకాయలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కె తదితర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలుచేస్తాయి.
బెండకాయ నీటిలో ఉండే ల్యూటిన్, జియాగ్జాంతిన్ వంటి పోషకాలు.. కంటిచూపును మెరుగుపరుస్తాయి. బెండకాయ నీటిని తలకు బాగా పట్టిస్తే.. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే ‘మ్యూసిలేజ్’ అనే జిగట పదార్థం.. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బెండకాయ నీళ్లు కుదుళ్లకు బలాన్నిచ్చి.. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. మాడును తేమగా ఉంచడంతోపాటు చుండ్రునూ నివారిస్తుంది. బెండకాయ నీటిని జుట్టు కుదుళ్లకు పట్టేలా రాసుకొని.. 15 – 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. జుట్టు నల్లగా, మృదువుగా తయారవుతుంది.