సొరకాయ(చిన్నది, లేతది): ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, టమాట: ఒకటి, మినుప వడియాలు: నాలుగు, ఆవనూనె: రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర: ఒక టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, ధనియాల పొడి, కారం, వేయించిన జీలకర్ర పొడి: ఒక టీస్పూన్ చొప్పున, కొత్తిమీర తురుము: కొద్దిగా, నిమ్మరసం: ఒక టీస్పూన్, లవంగాలు: నాలుగు, ఉప్పు: తగినంత.
సొరకాయను బాగా కడిగి పొడిగుడ్డతో తుడిచి అక్కడక్కడా నాలుగు లవంగాలు గుచ్చి ఒక టీస్పూన్ నూనెను కాయ మొత్తం రాయాలి. స్టవ్ మీద నేరుగా కానీ, జాలి వంటి దాన్ని కానీ ఉంచి సన్నని మంటపై సొరకాయ పూర్తిగా కాలేలా నిదానంగా కాల్చుకోవాలి. కాలిన సొరకాయను చల్లని నీళ్లలో వేసి, తొక్క తీసేసి, బాగా కడిగి వీలైనంత చిన్నగా తరగాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక మినుప వడియాలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక తరిగిన టమాట, సొరకాయ తురుము వేసి మగ్గనివ్వాలి. కారం, పసుపు, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు కూడా వేసి బాగా కలుపుతూ సన్నని మంటపై ఉడికించాలి. బాగా దగ్గరపడుతుండగా అరకప్పు నీళ్లుపోసి మరో ఐదు నిమిషాలు ఉడికించి కొత్తిమీర తురుము, నిమ్మరసం వేసి కలిపితే ఉత్తరాది స్పెషల్ సొరకాయ బార్తా రెడీ.
“Soya Manchurian Recipe | సోయా మంచూరియా తయారీ విధానం”