Radish Chutney Recipe | ముల్లంగి పచ్చడి తయారీ విధానం
Radish Chutney Recipe | ముల్లంగి పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు
ముల్లంగి: ఒకటి, నూనె: పావు కప్పు, ధనియాలు: ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర: ఒక టీస్పూన్, పోపుగింజలు (ఆవాలు, జీలకర్ర, మినుప పప్పు, శనగ పప్పు): రెండు టీస్పూన్లు, ఎండు మిరపకాయలు: పది, వెల్లుల్లి రెబ్బలు: ఐదు, కరివేపాకు: ఒక రెబ్బ, ఉల్లిగడ్డ: ఒకటి (చిన్నది), పసుపు: ఒక టీస్పూన్, చింతపండు గుజ్జు: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు:
తగినంత.
Radish Chutney Recipe | ముల్లంగి పచ్చడి తయారీ విధానం
ముందుగా ముల్లంగి తొక్కతీసి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. స్టవ్‌మీద పాన్‌పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనెవేసి వేడయ్యాక ధనియాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి రెండు నిమిషాలు సన్నని మంటపై వేయించి తీయాలి. అదే పాన్‌లో మరో టేబుల్ స్పూన్ నూనెవేసి ముల్లంగి ముక్కలను జోడించి సన్నని మంటపై వేయించాలి. వాసనపోయేలా వేగాక.. అర టీస్పూన్ పసుపు వేసి బాగా కలిపి దించేయాలి. ముందుగా వేయించుకున్న మిరపకాయల మిశ్రమం, తగినంత ఉప్పు, చింతపండు గుజ్జు మెత్తగా గ్రైండ్ చేశాక.. ముల్లంగి ముక్కలు కూడా వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. దీనికి పోపు పెడితే.. ముల్లంగి పచ్చడి సిద్ధం.
Read More :
Corn Cutlet Recipe | కార్న్ కట్లెట్ తయారీ విధానం
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

