ఆలుగడ్డలు: రెండు (చిన్నవి), బజ్జీమిర్చి: పది, శనగపిండి: ఒక కప్పు, కారం: ఒక టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, జీలకర్ర: ఒక టీస్పూన్, కొత్తిమీర: కొద్దిగా, ఉల్లిగడ్డ: ఒకటి (చిన్నది), నూనె: వేయించడానికి సరిపడా, వంటసోడా: చిటికెడు, నిమ్మరసం: ఒక టీస్పూన్
మిరపకాయలకు నిలువుగా గాట్లు పెట్టి గింజల్ని తీసి పెట్టుకోవాలి. ఆలుగడ్డలను ఉడకబెట్టి మెదుపుకోవాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనెవేసి వేడయ్యాక అర టీస్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, అర టీస్పూన్ కారం, కొద్దిగా పసుపు, ఉప్పు, అర టీస్పూన్ ధనియాల పొడి వేయాలి. అవి వేగాక మెదిపిన ఆలుగడ్డ ముద్దను కూడా వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం, కొత్తిమీర చల్లి దించేయాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి వేడిచేయాలి. ఒక గిన్నెలో శనగపిండి, అర టీస్పూన్ కారం, ధనియాలపొడి, జీలకర్ర, చిటికెడు పసుపు, ఉప్పు, వంటసోడా వేసి తగినన్ని నీళ్లుపోసి జారుగా కలుపుకోవాలి. గాట్లు పెట్టుకున్న మిరపకాయల్లో ఆలుగడ్డ మిశ్రమం కూరి పిండిలో ముంచి, నూనెలో వేసి దోరగా కాల్చుకుంటే వేడివేడి ఆలూ మిర్చి బజ్జీలు సిద్ధం.
Banana flower Vada Recipe | అరటిపువ్వు వడ తయారీ విధానం
Bread Manchurian Recipe బ్రెడ్ మంచూరియా తయారీ విధానం
oats omelette recipe | ఓట్స్ ఆమ్లెట్ తయారీ విధానం
chicken omlet recipe | చికెన్ ఆమ్లెట్ తయారీ విధానం