JEE Main-2 | జేఈఈ మెయిన్ -2 అడ్మిట్ కార్డులు రిలీజ్ చేసిన ఎన్టీఏ
JEE Main-2 | ఈ నెల ఆరో తేదీ నుంచి జరిగే జేఈఈ మెయిన్ రెండో దశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎన్టీఏ అడ్మిట్ కార్డులను సోమవారం విడుదల చేసింది.
JEE Main-2 | దేశంలోనే పేరొందిన ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ /బీఈ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE MAIN-2023) రెండో విడత ఎంట్రన్స్‌కు అడ్మిట్ కార్డులు విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). ఈ నెల ఆరో తేదీ నుంచి ఈ పరీక్షలు జరుగనున్నాయి. విద్యార్థులు www,nta.ac,in, https://jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్ల నుంచి తమ హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దేశంలోని 330 నగరాల పరిధిలో ఈ నెల 6,8,10,11,12,13,15 తేదీల్లో జేఈఈ-మెయిన్ రెండో సెషన్ పరీక్ష జరుగనున్నది. విదేశాల్లో 15 నగరాల్లోనూ ఈ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షకు 9.4 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నారు. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఒకవేళ జేఈఈ మెయిన్ రెండో దశ అడ్మిట్ కార్డు పొందడంలో ఇబ్బందులు తలెత్తితే విద్యార్థులు.. ఎన్టీఏ హెల్ప్‌లైన్ నంబర్ 011-40759000 ఫోన్ నంబర్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఫోన్ చేసి సంప్రదించి, తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చు. జేఈఈ మెయిన్‌లో టాప్ స్కోర్ సాధించే 2.50 లక్షల మంది విద్యార్థులు జూన్ నాలుగో తేదీన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరు కావాలి. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులు దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు.
Read Today's Latest Comparative-exams News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

