Nandamuri Taraka Ramarao | వైవీఎస్ చౌదరి (YVS Chowdary) ఈ పేరు ఇప్పుడున్న జనరేషన్‌కు తెలియదు కానీ సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాస్ లాంటి మాస్ సినిమాలు తీసింది ఇతడే గుర్తుపట్టవచ్చు. ఇప్పటికే పలువురు హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ క్రేజీ డైరెక్టర్ ఇప్పుడు నందమూరి తారకరామారావు కుటుంబం నుంచి మరో కొత్త నటుడిని పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. న్యూ టాలెంట్ రోర్స్ పతాకంపై యలమంచిలి గీత నిర్మిస్తున్నారు.
ఎన్టీఆర్ నాలుగో తరం వారసుడు నందమూరి హరికృష్ణ మనవడు (జానకిరామ్ కుమారుడు) నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Ramarao)ను టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నాడు వైవీఎస్. తెలుగమ్మాయి వీణ రావు హీరోయిన్గా నటించనుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం, చంద్రబోస్ సాహిత్యాన్ని అందించబోతున్నారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణల రచయిత.
అయితే ఈ సినిమాకు సంబంధించి గతంలో ఒక ఈవెంట్ పెట్టిన వైవీఎస్ తాజాగా అలాంటిదే మరోకటి నిర్వహించాడు. అయితే వైవీఎస్ చౌదరి నందమూరి ఫ్యామిలీకి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఆ అభిమానంతోనే దివంగత నటుడు హరికృష్ణతో కలిసి సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి బ్లాక్ బస్టర్లను నందమూరి ఫ్యామిలీకి అందించాడు. అయితే తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో మీడియా వైవీఎస్ను అడుగుతూ.. హరికృష్ణ, బాలకృష్ణతో సినిమాలు చేసిన మీరు జూ.ఎన్టీఆర్‌తో మాత్రం ఇప్పటివరకు సినిమా ఎందుకు చేయలేదు అని అడుగుతారు. అయితే ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు వైవీఎస్ చౌదరి.
అప్పుడప్పుడు నా సినిమాలకు కథ రాయడానికి నేను రెండు మూడేళ్లు తీసుకుంటా. కథ నేనే రాసుకోవడం వలన అప్పుడప్పుడు ఆలస్యం అవుతుంది. అయితే ఆ కథకి ఎవరు సరిపోతారో వారిని మాత్రమే ఎంపిక చేస్తా.. అగ్ర హీరోలతో సినిమాలు తీయాలని నేను ఎప్పుడు అనుకోను. అలాగే తారక్‌తో కూడా తీయాలని కానీ కథ కానీ ఎప్పుడు రెడీ చేసుకోలేదు. ఫ్యూచర్లో ఒకవేళ మంచి కథ రాసి తారక్ సెట్ అవుతాడు అనిపిస్తే అతడి దగ్గరికి వెళతా అంటూ వైవీఎస్ చౌదరి చెప్పుకోచ్చాడు.
Also Read..