Jagadish Reddy | ప్రాజెక్టుల్లో నీటినిల్వపై సబ్‌కమిటీ.. అదో విచిత్రం: మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) ఫైరయ్యారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని.. ఆ పార్టీ నాయకులకు ప్రభుత్వం నడపడంపై అవగాహన, బాధ్యత ఉన్నట్లుగా కనిపించడం లేదని విమర్శించారు.
సూర్యాపేట: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) ఫైరయ్యారు. రాష్ట్రంలో పరిపాలన పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని.. ఆ పార్టీ నాయకులకు ప్రభుత్వం నడపడంపై అవగాహన, బాధ్యత ఉన్నట్లుగా కనిపించడం లేదని విమర్శించారు. జల్సాలకే పరిమితమై రాష్ట్ర అభివృద్ధిని మరిచినట్లు కనబడుతుందన్నారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వపై కేబినెట్ సబ్‌కమిటీ వేయడం విచిత్రంగా ఉందని చెప్పారు. ప్రాజెక్టుల ప్రొటోకాల్ ముందే నిర్ణయం చేసి ఉంటుందని, ప్రపంచంలో ఇలాంటి పని కోసం సబ్ కమిటీ ఎక్కడా లేదని ఎద్దేవాచేశారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేషన్ కార్డుల అర్హుల నిర్ణయానికి సబ్‌కమిటీ అనాలోచిత నిర్ణయమన్నారు. తప్పించుకునేందుకు కాంగ్రెస్ దొంగబుద్ధి ప్రదర్శిస్తుందని విమర్శించారు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాని చెప్పారు.
కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి సూర్యాపేటకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. సుమారు 140 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాలకులకు సోయి, కనీస అవగాహన లేక నీటిని ఎత్తిపోయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్ఆర్ఎస్పీ ఫేస్-2కి నీళ్లు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రయోజనాలు పొందడంలేదన్నారు. లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రం పాలు చేస్తుందన్నారు. వరద పోయాక హడావుడి చేస్తే ప్రయోజనం ఉండదని.. ఒక్క ఎకరం ఎండినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. రైతాంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, హెలికాఫ్టర్లలో విహారయాత్రలు మాని ప్రొజెక్టుల పర్యటనలు చేయాలని హితవు పలికారు.
ప్రాజెక్టుల్లో గ్రౌడింగ్ సర్వసాధారణ ప్రక్రియ అని చెప్పారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో యాసంగిలో పొలాలు ఎండినట్లు ఇప్పుడు ఖరీఫ్‌లోనూ ఎండిపోయే పరిస్థితి కనపడుతుందన్నారు. ఎన్డీఎస్ఏకి నివేదికలు పంపి అనుమతులు తీసుకోవాలని.. వర్షాలు ఆగి వరద రాకపోతే తెలంగాణ రైతుల ప్రాణాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్ ఎత్తిపోతల ప్రారంభించాలని.. రివ్యూ చేసి ఎత్తిపోతలు మొదలుపెట్టకపోతే రైతులకు ద్రోహం చేసినట్టేనన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం జీవో33తో తెలంగాన విద్యార్థులకు నష్టం జరుగుతుందని చెప్పారు. జీవోపై న్యాయ పోరాటానికి సైతం వెనుకాడమన్నారు. విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందన్నారు. పాత విధానాన్నే కొనసాగించాలని.. పాత బాసులను సంతృప్తి పరిచేందుకే రేవంత్ చేస్తున్న ప్రయత్నం ఇదని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

