Youtuber Praneeth Hanumantu | చిన్న పిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసిన తెలుగు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యాడు. ప్రణీత్ బెంగళూరులో ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అతడిని అరెస్ట్ చేశారు.
అసలు ఏం జరిగిందంటే..
ఫనుమంతు (phanumantu) అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న ప్రణీత్ తన ఛానల్లో తన ఫ్రెండ్స్‌తో కలిసి లైవ్ వీడియోస్‌కి రియాక్షన్ ఇవ్వడం, కామెంట్ల్ చేయడం వంటివి చేస్తాడు. అయితే తన ఫ్రెండ్స్‌తో కలిసి ఒక వ్లాగ్ చేస్తూ.. తండ్రీకూతుళ్ల అనుబంధంపై లైంగిక కామెంట్లు చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. ఈ వీడియోపై నెటిజన్లతో పాటు టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్, సింగర్ చిన్మాయి, అడివిశేష్, సూధీర్ బాబు, మంచు మనోజ్, స్పందిస్తూ.. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, డిప్యూటీ సీఎంలను విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ కేసును సూమోటోగా తీసుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు అతడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ కేసులో మరో సంచలన విషయం బయట పడింది ఈ కేసు విషయంపై ప్రణీత్ బెంగళూరులో ఉన్నాడని ట్రాక్ చేసిన పోలీసులు అతడిని పట్టుకుందామని వెళ్లగా.. అతడు పోలీసుల కళ్లు గప్పి అమెరికాకు పారిపోతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ప్రణీత్ అమెరికాకు పారిపోతున్నట్లు సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు హుటాహుటిన అతడిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఇక అరెస్ట్ అయిన అనంతరం తెలంగాణ పోలీసులు అతడిని స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అనుమతితో ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని నేడు హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు. అనంతరం అతడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నారు.
Also Read..