Deputy Cm Bhatti Vikramarka | పిల్లల కోసం సాయి ధరమ్ తేజ్ స్పెషల్ పోస్ట్ .. స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Sai Dharam Tej | ఈ మధ్య తెలుగు యూట్యూబర్స్ చిన్న పిల్లల వీడియోలపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఫనుమంతు (phanumantu) అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న ఒక తెలుగు యూట్యూబర్ తన ఛానల్లో తన ఫ్రెండ్స్‌తో కలిసి లైవ్ వీడియోస్‌కి రియాక్షన్ ఇవ్వడం, కామెంట్ల్ చేయడం వంటివి చేస్తాడు.
Sai Dharam Tej | ఈ మధ్య తెలుగు యూట్యూబర్స్ చిన్న పిల్లల వీడియోలపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఫనుమంతు (phanumantu) అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న ఒక తెలుగు యూట్యూబర్ తన ఛానల్లో తన ఫ్రెండ్స్‌తో కలిసి లైవ్ వీడియోస్‌కి రియాక్షన్ ఇవ్వడం, కామెంట్ల్ చేయడం వంటివి చేస్తాడు. అయితే తన ఫ్రెండ్స్‌తో కలిసి ఒక వ్లాగ్ చేస్తూ.. చిన్నపిల్లలపై లైంగిక కామెంట్లు చేశారు. దీంతో ఈ వీడియో ఫుల్ కాంట్రావర్సీగా మారింది. ఈ విషయంపై నెటిజన్లతో పాటు టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ ఎక్స్ వేదికగా స్పందించాడు.
సోషల్ మీడియాను ఎక్కువగా వాడే తల్లిదండ్రులకు సాయి తేజ్ తాజాగా ఓ విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా చాలా క్రూరంగా, ప్రమాదకరంగా మారిపోయింది. దయ చేసి జాగ్రత్తగా ఉండండి. కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారింది. పొరపాటున ఒక్క పోస్ట్ పెడితే చాలు దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు మీ పిల్లల ఫోటోలు, లేదా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు దయచేసి జాగ్రత్తగా ఉండండి.. కొంతమంది మీ పిల్లలపై చేసే కామెంట్స్ చూసి మీరు తట్టుకోలేరు. మిమ్మల్ని ఎంతగానో బాధపెడతాయి ఆ కామెంట్స్.. మీ పిల్లల ఫోటోలు, వీడియోలు షేర్ చేయకపోవడం మంచిది అని నా భావన. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు తేజ్. ఈ పోస్ట్‌కు తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంలతో పాటు తెలంగాణ డీజీపీ, ఆంధ్రప్రదేశ్ సీఎం, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎక్స్ ఖాతాలను ట్యాగ్ చేశాడు. అయితే ఈ పోస్ట్‌పై తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించాడు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎక్స్‌లో స్పందిస్తూ.. ఇలాంటి క్లిష్టమైన సమస్యను లేవనెత్తినందుకు ధన్యవాదాలు సాయిధరమ్ తేజ్. పిల్లల భద్రత అనేది నిజానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విషయం. మా ప్రభుతం పిల్లల పట్ల జరుగుతున్న అగాయిత్యాల పట్ల, సోషల్ మీడియాలో ఇలాంటి పనులు చేస్తున్న వాళ్ళ పట్ల జరుగుతున్న ఘోరమైన విషయాల పట్ల కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. మన పిల్లలకు సురక్షితమైన ఆన్లైన్ ప్రపంచాన్ని సృష్టించడానికి అందరం కలిసి పని చేద్దాం. అంటూ భట్టి రాసుకోచ్చాడు.
This is beyond gruesome, disgusting and scary.
Monsters like these go unnoticed on the very much utilised social platform doing child abuse in the disguise of so-called Fun & Dank.Child Safety is the need of the hour 🙏🏼
I sincerely request
Hon’ble Chief Minister of Telangana… https://t.co/05GdKW1F0s— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 7, 2024
Thank you for raising this critical issue @IamSaiDharamTej garu, Child safety is indeed a top priority. we will ensure that our government takes necessary steps to prevent child abuse and exploitation on social media platforms. Let’s work together to create a safer online… https://t.co/OGQ4NN4doh
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) July 7, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

