టాలీవుడ్లో చాలా రోజులుగా రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. పోకిరి సినిమాతో మొదలైన రీరిలీజ్ ట్రెండ్ ఏదో ఒక సినిమాతో మళ్లీ కొనసాగుతూనే ఉంది. 90ల్లో ఆల్‌టైమ్ ఎవర్ గ్రీన్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచిన చిత్రం ప్రేమదేశం (Prema Desam). వినీత్, అబ్బాస్, టబు కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రాన్ని కథిర్ (Kathir) డైరెక్ట్ చేశాడు. తాజాగా రీరిలీజ్ అవబోతున్న సినిమాల జాబితాలో ప్రేమదేశం కూడా చేరిపోయింది.
ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ థియేటర్లలోకి వచ్చి 25 ఏండ్లకుపైగా అవుతుంది. అప్పట్లో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుని, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది ప్రేమదేశం. ఈ చిత్రం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ రీరిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారన్న వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే ఎప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. శ్రీమాతా క్రియేషన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.
ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన ప్రేమదేశం సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్స్‌లో టాప్‌లో ఉంటాయి. ఈ చిత్రంలో వడివేలు, ఎస్పీ బాలసుబ్రఃహ్మణ్యం, శ్రీవిద్య, చిన్ని జయంత్ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ప్రేమదేశం సినిమా రన్‌టైం 158 నిమిషాలు కాగా.. జెంటిల్మెన్ ఫిలిం ఇంటర్నేషనల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 23 1996న విడుదలైంది.
Read Also : Praveena Paruchuri | కేరాఫ్ కంచెరపాలెం నిర్మాత మూడో సినిమా.. వివరాలివే
Read Also : Sir Movie | ధనుష్ ‘సార్’ మూవీ క్రేజీ అప్డేట్..!
Read Also : Shobu Yarlagadda | మైండ్ బ్లోయింగ్.. కాంతార సినిమాపై బాహుబలి నిర్మాత శోభుయార్లగడ్డ