కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్న చిత్రం కాంతార (kantara). యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో కేజీఎఫ్ ఫేం హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ తెరకెక్కించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ పోషించిన ఈ మూవీ సెప్టెంబర్ 30న మాతృక భాష కన్నడలో విడుదలై భారీ రికార్డులు సృష్టిస్తోంది.
ఈ చిత్రం తెలుగు వెర్షన్ ను గీతా ఆర్ట్స్ బ్యానర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా మంచి టాక్‌తో కలెక్షన్లు వసూళ్లు చేస్తోంది. భారత సినీ పరిశ్రమలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ ఇప్పటికే కాంతారపై ప్రశంసల జల్లు కురిపించారు. కాగా ఇపుడు బాహుబలి చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్ట్ అయ్యారు.
కాంతార మైండ్బ్లోయింగ్గా ఉంది. ఈ సినిమాలాగా ఏ సినిమా నన్ను టచ్ చేయలేదు..ఓరి దేవుగా క్లైమాక్స్ అద్బుతంగా ఉంది. దయచేసి థియేటర్లలో చూడండి! ఏం యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, సంగీతం..రిషబ్ శెట్టి, హోంబయే ఫిలిమ్స్ టీంకు జయహో అనాల్సిందే..అంటూ శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఇప్పటికే స్టార్ హీరోయిన్ అనుష్క స్పందిస్తూ..అద్బుతమైన ఎక్స్పీరియన్స్ అందించిన కాంతార టీంకు ధన్యవాదాలు తెలియజేసింది. ఈ చిత్రంలో సప్తమి గౌడ, కిశోర్, అచ్యుత్ కుమార్, నవీన్ డీ పడ్లి, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. అంజనీష్ లోక్ నాథ్ కాంతార చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
#Kantara! Mind Blown! No film has touched me at the core as this film! Its cinematic brilliance!! The climax..Oh my god ! Please watch it in theatres! What performances, cinematography and music! Take a bow @shetty_rishab @hombalefilms and the entire team! 🙏🙏
— Shobu Yarlagadda (@Shobu_) October 23, 2022
Read Also : Praveena Paruchuri | కేరాఫ్ కంచెరపాలెం నిర్మాత మూడో సినిమా.. వివరాలివే
Read Also : Prema Desam | రీరిలీజ్ జాబితాలో యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ప్రేమదేశం
Read Also : Sir Movie | ధనుష్ ‘సార్’ మూవీ క్రేజీ అప్డేట్..!