Prasanth Varma | తెలుగు ఇండస్ట్రీ నుంచి విడుదలై పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది హనుమాన్ (Hanuman). ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో సూపర్ హీరో ఫిల్మ్‌గా విడుదలైన ఈ చిత్రం ఉత్తరాదిన కూడా అద్బుతమైన వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఓ సందేశాన్ని అందరితో పంచుకున్నాడు ప్రశాంత్ వర్మ.
హను-మాన్ అందుకున్న అపారమైన ప్రేమ, అభిమానానికి నేను నిజంగా కృతజ్ఞుడను. మన పురాతన ఇతిహాసాలను ఆధునిక సూపర్ హీరోతో జోడించి చూపించిన విజన్‌ను మనం షేర్ చేసుకున్నప్పటి నుండి నేటి వరకు ఏడాది పూర్తయింది. ఈ మాయాజాలాన్ని సృష్టించడంలో తమ మనస్సును పెట్టిన అద్భుతమైన నిర్మాతలు, తారాగణం, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
హనుమాన్ నాకు హిట్ కంటే ఎక్కువ ఇచ్చింది. అది నాలో ఆశలను రేకెత్తించింది. ఆ అభిరుచి, ఆశీర్వాదాలు అద్భుతాలు జరిగేలా చేసింది. మీ విశ్వాసం, మద్దతుకు ధన్యవాదాలు. మనమంతా కలిసి మనందరినీ ఏకం చేసే, మనకు స్ఫూర్తినిచ్చే కథలను వేడుక చేసుకుందాం అని ట్వీట్ చేశాడు. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రశాంత్శర్మకు శుభాకాంక్షలు తెలియజేస్తూనే హనుమాన్ సీక్వెల్ అప్డేట్ ఇవ్వాలని అడుగుతున్నారు. కన్నడ స్టార్ యాక్టర్ రిషబ్ శెట్టి లీడ్ రోల్లో వస్తోన్న జైహనుమాన్ షూటింగ్ దశలో ఉండగా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
#1YearForHanuMan pic.twitter.com/TvoBG0f2ug
— Prasanth Varma (@PrasanthVarma) January 12, 2025
Game Changer | గేమ్ ఛేంజర్ కలెక్షన్లు ఫేకా?.. రిపోర్ట్స్ ఏం అంటున్నాయి అంటే.!
Daaku Maharaaj | డాకుమహారాజ్ సెట్స్‌లో బాలకృష్ణను హత్తుకొని ఏడ్చేసిన చిన్నారి