Game Changer Collections Real or Fake | ఈ మధ్య టాలీవుడ్ సినిమా కలెక్షన్లు చూస్తుంటే అవి నిజంగా నమ్మాలా లేదా అనే సందేహం వస్తున్నాయి. మా హీరో రూ.1000 కోట్లు కొట్టాలి అని అభిమానులు.. నా సినిమాకి ఎక్కువ కలెక్షన్లు రావాలని నిర్మాతలు నేను కూడా ఇన్ని కోట్ల క్లబ్లో చేరాను అని హీరోలు.. ఇలా తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఒక ఫేక్ ఇండస్ట్రీగా మారిపోయినట్లు తెలుస్తుంది. ఇంతకుముందు కథను నమ్మే తీసే దర్శకులు, నటులు సైతం కమర్శియల్ పంతాలో పోవడమే దీనికి నిదర్శనం. గత ఏడాది వచ్చిన ప్రభాస్ సలార్ సినిమా ఎలా ఫేక్ కలెక్షన్లు వేసి విమర్శల పాలయ్యిందో తాజాగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రం కూడా అదే రేంజ్లో ఇప్పుడు ఆన్లైన్లో ఒక ట్రోలింగ్ మెటీరియల్‌గా మారింది.
రామ్ చరణ్, శంకర్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. శంకర్ మ్యాజిక్ ఈ సినిమాకి పనిచేయక పోగా.. అదే పాత రోడ్డ కొట్టుడు కమర్శియల్ సినిమా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి వచ్చిన ఇంత నెగిటివ్ టాక్‌కి కనీసం రూ.100 కోట్లు అయిన కలెక్షన్లు చేస్తుందా అని అంతా భావించారు. కానీ ఏకంగా మొదటి రోజు ఈ చిత్రం రూ.186 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
అయితే ఈ సినిమా కలెక్షన్లపై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ మొదలైంది. అసలు కలెక్షన్లు వేయకుండా ఇలా ఫేక్ కలెక్షన్లు వేసి జనాలు మోసం చేస్తున్నారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కొందరూ అయితే ఈ సినిమా చూడడానికి జనాలు కూడా రావట్లేదని.. థియేటర్లతో పాటు ఆన్లైన్ బుకింగ్స్ సైట్ బుక్ మై షోలో కూడా గేమ్ ఛేంజర్ సీట్లు ఖాళీగా చూపిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇలా చేయడం వలన నిర్మాతలకు ఏం వస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఫేక్ కలెక్షన్లు సృష్టించడం వలన ఇది ఫ్యూచర్లో ఎఫెక్ట్ పడడంతో పాటు హీరో కెరీర్లో చెరిగిపోని మచ్చగా మిగిలిపొతుందని టాక్.
టోఫి చాకోలెట్ని గుర్తుకి తెచ్చిన గేమ్ ఛేంజర్..
ఇదిలావుంటే ఫేక్ కలెక్షన్లకు సంబంధించి అది నిజామా లేదా ఫేకా అని నమ్మడానికి ఇంటర్నెట్ మంచిగా ఉపయోగపడుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. దీనికి మంచి ఉదాహరణ.. టోఫి చాక్లెట్ ఫేక్ సేల్స్. ఇంతకుముందు టోఫి (Toffee) చాక్లెట్స్ని కిరాణ షాపుల్లో చిల్లర కోసం వాడేవారు. ఆర్థ రూపాయికి చిల్లర లేకున్నా రూపాయికి చిల్లర లేకున్న చిల్లర బదులు చాక్లెట్లను చేతిలో పెట్టేవారు కిరాణ షాపు యజమానులు. ఇలా చేయడం వలన ఈ చాకోలెట్ సేల్స్ విపరీతంగా పెరుగగా.. మా చాకోలెట్ బాగుండడం వలనే సేల్స్ పెరిగినట్లు కంపెనీ జనాలను నమ్మించింది. కానీ ఎప్పుడు అయితే యుపీఐ వచ్చిందో.. జనాలు క్యాష్ వాడకుండా డిజిటల్ పేమెంట్స్ స్టార్ట్ చేశారో.. అప్పుడు ఈ చాక్లెట్ సేల్స్ ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో జనాలకు నిజం ఏంటో తెలియడంతో పాటు.. ఈ చాక్లెట్ సేల్స్ కంపెనీ చెప్పినట్లు కాదని.. అవన్ని ఫేక్ అని తర్వాత తెలిసింది.
అయితే ఈ విషయం గేమ్ ఛేంజర్ సినిమాకి కూడా వర్తించబోతుందని మేకర్స్ తెలుసుకోవాలి. సినిమా మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా.. ఈ రేంజ్లో ఫేక్ కలెక్షన్లు సృష్టించి అబద్ద ప్రచారం చేయడం వలన సినిమా కొన్ని రోజులు నడుస్తుందేమో కానీ చివరికి ప్రేక్షకులకి నిజం తెలుస్తుందని అర్థం చేసుకోవాలి.
Game Changer❌ Number Changer✅#GlobalFraudRamCharan #GameChangerPosterScam pic.twitter.com/mtNEdsxSDX
— 𝙢𝘼𝙝𝘼𝙣📟 (@Aryasanthuuu) January 11, 2025
Day 1 Gross
Earth – 120cr
Mars – 20cr
Venus – 30cr
Pluto – 16crRagging 🤣 😂. #GameChangerpic.twitter.com/AYut93p5SJ
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) January 11, 2025
#Gamechanger review :400 petti vocha sofa esaru padukunna 😂😂#Gameover#DisasterGameChanger pic.twitter.com/dqRfcxS2W9
— 𝗗𝗥𝗔𝗚𝗢𝗡 𝗪𝗔𝗥🐉 (@NtrneelMode) January 10, 2025