రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని యువహీరో సిద్ధు జొన్నలగడ్డ, ఆయన తండ్రి సాయికృష్ణ జొన్నలగడ్డ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కి 15లక్షల రూపాయలు చెక్కు రూపంలో విరాళంగా అందించారు. తెలంగాణ వరదల సహాయ చర్యల నిమిత్తం ఈ డబ్బు అందజేస్తున్నట్టు వారు తెలిపారు. విపత్తు సమయంలో ప్రభుత్వానికి అండగా నిలిచి తన ఔదార్యాన్ని చాటుకున్న సిద్దు జొన్నలగడ్డను ముఖ్యమంత్రి రేవంత్ అభినందించారు.