Kangana Ranaut | బాటీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) నటించిన చిత్రం ఎమర్జెన్సీ (Emergency). ప్రస్తుతం ఈ మూవీ ఈ నెల 17న విడుదల కాగా.. దేశవ్యాప్తంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ మూవీ మాత్రం పంజాబ్ (Punjab)లో బ్యాన్ చేశారు. ఎమర్జెన్సీ మూవీలో పంజాబ్‌లో నిషేధించడంపై కంగనా రనౌత్ స్పందించింది. పంజాబ్‌లో సినిమా విడుదలకాకపోవడంపై విచారం వ్యక్తం చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదిక ఓ వీడియోను పోస్ట్ చేసింది. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులను కృతజ్ఞతలు తెలిపింది. జీ స్టూడియోతో పాటు సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి పేరిట ధన్యవాదాలు చెప్పింది. తనపై ప్రేమను చూపడంతో పాటు గౌరవం ఇచ్చారని.. చెప్పేందుకు తనకు మాటలు రావడం లేదని చెప్పుకొచ్చింది.
Read Also : Kantara Team | చిక్కుల్లో రిషబ్ షెట్టి ‘కాంతార’ మూవీ టీమ్.. కేసు నమోదు!
అయితే, తన హృదయంలో కొంత బాధ ఉందని.. నా సినిమాలు పంజాబ్‌లో ఎక్కువగా ఆడుతాయని ఇండస్ట్రీలో టాక్ ఉందని కంగనా పేర్కొంది. పంజాబ్‌లో బ్యాన్ చేయగా.. కెనడా, బ్రిటన్‌లోనూ సినిమా ప్రదర్శనను అడ్డుకున్న నేపథ్యంలో స్పందిస్తూ.. కొందరు కావాలనే ఈ పని చేస్తున్నారని విమర్శించింది. తన సినిమా ఆలోచనలను దేశంపై తనకున్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తుందని.. ఈ సినిమా మనల్ని ఏకం చేస్తుందా? విభజిస్తుందా? అనేది మూవీ చూసిన తర్వాతనే నిర్ణయించుకోవాలని కోరింది. ఇంతకన్నా తానేమీ చెప్పనని జై హింద్.. ధన్యవాదాలు అంటూ ఇన్‌స్టా వీడియోలో ముగించింది.
Read Also : Venkatesh | నా భార్యకు అన్ని పాస్వర్డ్లు తెలుసు.. వెంకటేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘ఎమర్జెన్సీ’ చిత్రంలో కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. ఈ మూవీకి డైరెక్టర్‌గానూ వ్యవహరించింది. దాదాపు రూ.25కోట్లతో బడ్జెట్ తెరకెక్కించగా.. ఇప్పటి వరకు ఈ మూవీకి రూ.10.45కోట్లు కలెక్షన్ వచ్చాయి. పంజాబ్‌లో పలువురు కాంగ్రెస్ నేతలు, రైతు సంఘాల నేతలు, సిక్కు మతాలకు చెందిన నేతలు కంగనా రనౌత్ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో సోదరభావాన్ని దెబ్బతీసేలా చిత్రం ఉందని ఆరోపించారు. 1984 నాటి సిక్కు మత చరిత్రను వక్రీకరించే రీతిలో ‘ఎమర్జెన్సీ’ మూవీని చిత్రీకరించారని శిరోమణి గురుద్వారా పర్బంధర్ కమిటీ (SGPC) సైతం ఆరోపించింది.