Venkatesh | టాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న సీనియర్ హీరోల్లో టాప్‌లో ఉంటాడు వెంకటేశ్ (Venkatesh). తనదైన మ్యానరిజంతో వినోదాన్ని పంచే వెంకీ ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటించాడు. భార్య, మాజీ ప్రియురాలి మధ్య చిక్కుకున్న భర్త పాత్రలో నటించాడు వెంకటేశ్. ఇందులో వెంకీ చెప్పే డైలాగ్స్ చాలా మంది ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెంకటేశ్‌ను ఆసక్తికర ప్రశ్న అడిగింది యాంకర్ సుమ. మీ భార్యకు మీ మొబైల్ పాస్వర్డ్లు, ఇతర పాస్వర్డ్లు తెలుసా..? అని వెంకీని అడిగింది సుమ. దీనికి వెంకీ ఏ మాత్రం తడబడకుండా నా భార్యకు నా మొబైల్‌తోపాటు అన్ని ఖాతాలో పాస్వర్డ్లు తెలుసు. ఈ విషయంలో నేను చాలా పారదర్శకంగా ఉంటా. ఆమెకు పూర్తి స్వేచ్చ ఇచ్చేశానంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కేవలం 6 రోజుల్లోనే రూ.100 కోట్ల షేర్‌ను రాబట్టి వెంకీ కెరీర్లో నయా బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. అనిల్ రావిపూడి కెరీర్ మైల్ స్టోన్ సినిమాగా నిలవడమే కాకుండా.. కెరీర్లో సెకండ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్‌గా నిలిచింది. ఈ చిత్రంలో నరేశ్, పాపులర్ మరాఠీ యాక్టర్, యానిమల్ ఫేం ఉపేంద్ర లిమాయే, కోలీవుడ్ నటుడు వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు.
#BlockbusterSankranthikiVasthunam joins the elite 100Crore+ share club in just 6 days 💥💥💥#Venkatesh pic.twitter.com/2YwQfR6ZLc
— TalkEnti (@thetalkenti) January 20, 2025
Kichcha Sudeepa | హోస్ట్‌గా 11 సీజన్లు.. బిగ్ బాస్ షోకి గుడ్ బై చెప్పిన కన్నడ స్టార్ హీరో
Shatrughan Sinha | ఏఐతో సైఫ్ అలీఖాన్‌పై పోస్ట్.. విమర్శలు ఎదుర్కొంటున్న ఎంపీ శత్రుఘ్న సిన్హా
Thalapathy 70 | దళపతి 70కు ప్లాన్.. విజయ్ ఏంటీ పవన్ కల్యాణ్ రూటులోనే వెళ్తున్నాడా..?