Yashika Anand | నేను చచ్చిపోయుంటే బాగుండేది.. అనవసరంగా బతికున్నా.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
తమిళ నటి యషికాఆనంద్ (Yashika Anand) కొన్ని రోజుల కింద జరిగిన కారు ప్రమాదం (Car Accident) లో తన స్నేహితురాలు భవానీని పోగొట్టుకున్న విషయం తెలిసిందే. యషికాఆనంద్ కూడా తీవ్రగాయాలతో మంచానికే పరిమితమైంది.

బతికుండగానే చావును కోరుకునేంత దౌర్భాగ్యం ఎవరికీ రాకూడదు. కానీ తనకు వచ్చిందంటుంది బిగ్ బాస్ బ్యూటీ, కాంట్రవర్సియల్ హీరోయిన్ యషికా ఆనంద్ (Yashika Anand). ఈమెకు కొన్ని రోజుల కింద దారుణమైన యాక్సిడెంట్ అయింది. అందులో తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. ఇంకా చెప్పాలంటే చచ్చి బతికింది. కానీ ఇదే ప్రమాదంలో తన స్నేహితురాలు భవానీని పోగొట్టుకుంది యషికా. తమిళనాట బిగ్ బాస్ (Tamil Big Boss) తో పాటు కాంట్రవర్సీలతోనే ఎక్కువగా ఫేమస్ అయిన యషికా ఆనంద్ ప్రస్తుతం బెడ్డుకే పరిమితం అయిపోయింది. మరో 5 నెలల పాటు కదల్లేని పరిస్థితుల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే ఎటూ చూడలేని పరిస్థితి ఈమెది ఇప్పుడు. ఆగస్ట్ 4న ఈమె పుట్టిన రోజు కావడం గమనార్హం. కానీ ఈ పుట్టిన రోజున ఎందుకు బతికున్నానా అని బాధ పడుతుంది ఈమె.
కొన్ని రోజుల కింద జరిగిన కారు ప్రమాదంలో ఈమె స్నేహితురాలు భవానీ స్పాట్ లోనే చనిపోయింది. వీకెండ్ కావడంతో ముగ్గురు స్నేహితులతో కలిసి యషిక మహాబలిపురం లాంగ్‌డ్రైవ్‌కి వెళ్లింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత వీళ్ళు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఒక్కసారిగా డివైడర్‌ను ఢీ కొట్టింది. కళ్లు మూసి తెరిచేలోపే ఘోరం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో కారులో వాళ్ళతోపాటు ప్రయాణిస్తున్న భవానీ అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన యషిక, ఆమె మరో ఇద్దరు స్నేహితులను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. ఇందులో యషికా పరిస్థితి కూడా దారుణంగానే ఉందిప్పుడు. రెండు వారాల తర్వాత ఇంటికి వచ్చిన ఈమె కనీసం కదల్లేని పరిస్థితుల్లో ఉంది. దురవంగల్ పత్తినారు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది యషికా.
సినిమాల కంటే ఎక్కువగా ఈమె వివాదాలతోనే గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు తన ఫ్రెండ్ మరణం తట్టుకోలేని యషికా.. తాను కూడా చనిపోయుంటే బాగుండేదని.. ఇప్పుడు బతికున్నా కూడా సంతోషంగా లేనంటూ ఎమోషనల్ అవుతుంది. జీవితంలో నన్ను నువ్వు క్షమించవని తెలుసు.. వీలైతే మళ్లీ మా మధ్యకు రా అంటూ ఏడ్చేస్తుంది యషికా. దేవుడు తనను బతికించినందుకు సంతోషపడాలో.. తన స్నేహితురాలిని తీసుకెళ్లినందుకు బాధ పడాలో అర్థం కావడం లేదంటుంది ఈ బ్యూటీ. ఏదేమైనా కూడా బర్త్ డే రోజే చచ్చిపోతే బాగుండు అనడం మాత్రం ఆమె ఫాలోయర్స్ తట్టుకోలేకపోతున్నారు. యాక్సిడెంట్ అయితే మీరేం చేస్తారు.. ధైర్యంగా ఉండాలంటూ కామెంట్ చేస్తున్నారు.
యషికా ఆనంద్ స్టిల్స్..
ఇవి కూడా చదవండి..
Prakash Raj Tweet warning | ‘తెగేదాకా లాగకండి..’ప్రకాశ్ రాజ్ ట్వీట్ వార్నింగ్
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య










