Prakash Raj Tweet warning | ‘తెగేదాకా లాక్కండి..’ మా ఎన్నికలపై ప్రకాశ్ రాజ్ పంచ్ లైన్..!
'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు (MAA Elections ) నిర్వహించే అంశంలో 'మా' అధ్యక్షుడు వీకే నరేష్ తీరుపై ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ట్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు (MAA Elections ) వచ్చే నెలలో జరుగాల్సి ఉందన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు వీకే నరేష్ ప్రకటనలు మాత్రం ఎన్నికలు జరుగుతాయా..? లేదా? అనే సందేహాన్ని కలిగిస్తున్నాయి. కోవిడ్ -19 పరిస్థితులను తెరపైకి తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని ఓ న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
మరోవైపు ప్రస్తుత పరిస్థితులను కోట్ చేస్తూ ప్రకాశ్ రాజ్ (Prakash Raj) పెట్టిన ట్వీట్ తెగ ట్రెండింగ్ అవుతోంది. ప్రకాశ్ రాజ్ ట్విటర్ లో తెగేదాకా లాగకండి అని ట్వీట్ పెట్టాడు. తాజా ట్వీట్ తో నరేశ్ అండ్ బ్యాచ్ పై తనదైన చమత్కారంతో కామెంట్స్ చేశాడు ప్రకాశ్ రాజ్. సమస్యను మరింత జఠిలం చేయొద్దని ఈ ట్వీట్ తో ప్రకాశ్ రాజ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారని అంతా అనుకుంటున్నారు.
ప్రకాశ్ రాజ్ అండ్ ప్యానెల్ మా ఎన్నికల నొటిఫికేషన్ విడుదల చేయాలని నరేశ్ పై ఒత్తిడి తీసుకున్నట్టు తెలుస్తోండగా..నరేశ్ మాత్రం దాటవేత ధోరణిని అవలంభిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ‘మా’ అధ్యక్ష బరిలో నిలబడుతున్న మరో అభ్యర్థి మంచు విష్ణుకు నరేశ్ అండ్ టీం నుంచి మద్దతు ఇస్తున్నట్టు ఇప్పటికే బహిరంగంగా వెల్లడైంది. మరి ప్రకాశ్ రాజ్ వార్నింగ్ దృష్ట్యా నరేశ్ మా ఎన్నికలపై ఏమైనా ఆలోచిస్తారా..? లేదంటే వాయిదా వేస్తారా..? అనేది చూడాలి.
తెగేదాకా లాక్కండి….#Justasking
— Prakash Raj (@prakashraaj) August 4, 2021
ఇవి కూడా చదవండి..
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

