Yash Boss | కేజీఎఫ్ ప్రాంచైజీతో వరల్డ్‌వైడ్‌గా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కన్నడ స్టార్ యాక్టర్ యశ్ (Yash). ప్రస్తుతం యశ్ టాక్సిక్ సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. కాగా ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉన్న యశ్ కాస్త విరామం తీసుకుని ఆధ్మాత్మిక సేవలో తరించాడు. ఇవాళ ధర్మస్థల టౌన్‌లోని ప్రముఖ బెల్తంగడి సూర్య సదాశివ రుద్ర ఆలయాన్ని (Surya Sadashiva Rudra Temple) కుటుంబసమేతంగా సందర్శించాడు . ఈ సందర్భంగా ఆలయ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి యశ్ కుటుంబసభ్యులకు ఆశీర్వచనాలు అందించారు.
అనంతరం ఆలయ అన్నదాన సత్రంలో భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశాడు యశ్. ఆలయ సందర్శన సందర్భంగా సిబ్బందితో కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేజీఎఫ్ ప్రాంఛైజీ తర్వాత నటిస్తోన్న టాక్సిక్ చిత్రాన్ని పాపులర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తున్నారు. A Fairy Tale For Grown Ups ట్యాగ్‌లైన్‌తో యశ్ 19వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్ పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఉండబోతున్న ఈ చిత్రాన్ని కథానుగుణంగా 1970స్ గోవా, కర్ణాటక బ్యాక్ డ్రాప్లో చిత్రీకరించనున్నారట మేకర్స్. బెంగళూరులో అగ్రభాగం, కొంతభాగం శ్రీలంకలో టాక్సిక్ షూటింగ్ కొనసాగించనున్నారట మేకర్స్.
The Spiritual Side Of #Yash is Commendable 🙏#YashBOSS & #Radhika at Beltangadi Surya Sadashiva Rudra Temple.#ToxicTheMovie Shoot From 8th Aug. pic.twitter.com/VQGRbl7QRk
— Ashwani kumar (@BorntobeAshwani) August 6, 2024
NTR Neel | హమ్మయ్య.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా లాంచ్ డేట్ ఫైనల్..!