Yami Gautam | గౌరవం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది బాలీవుడ్ భామ యామీ గౌతమ్ (Yami Gautam). యురి ఫేం ఆదిత్యాధర్ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు తగ్గించిన ఈ భామ గతేడాది ఆర్టికల్ 370తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ధూమ్‌ధాం (Dhoom Dhaam) సినిమాలో నటిస్తోంది. ప్రతీక్ గాంధీ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పోస్టర్ ఒకటి విడుదల చేశారు.
వరుడు కావలెను.. వధువు కావలెను అనే వివాహ ప్రకటనతో సరికొత్తగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీ థియేటర్లలో విడుదల కాకుండా.. డైరెక్ట్‌గా ఓటీటీలో ప్రీమియర్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించేసింది. తాజా టాక్ ప్రకారం ధూమ్‌ధాం వాలైంటైన్స్ డేన రిలీజ్ కానుందని తెలుస్తుండగా.. మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
ఇందులో ముంబైకి చెందిన కోయల్ చద్దా అనే మహిళ పాత్రలో నటిస్తోంది. ప్రతీక్ గాంధీ గుజరాత్‌కు చెందిన వెటర్నరీ డాక్టర్ వీర్‌గా కనిపించబోతున్నాడు. పెద్దలు కుదిర్చిన వివావాం, ఇద్దరి మధ్య సాగే ప్రయాణం నేపథ్యంలో కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ కలయికతో సినిమా ఉండబోతుందని బీటౌన్ సర్కిల్ టాక్.
రిషబ్ సేత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని జ్యోతి దేశ్‌పాండే నిర్మిస్తున్నారు. ఆదిత్యా ధర్, లోకేశ్ ధార్, పునీత్ వడ్డన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేశవ్ ధర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Don’t DM us for rishtas kyunki humari shaadi “Dhoom Dhaam” se hone vaali hai 🕺#DhoomDhaam #DhoomDhaamOnNetflix pic.twitter.com/t3GcA8Z4fY
— Netflix India (@NetflixIndia) January 19, 2025
Manchu Vishnu | కన్నప్ప ప్రమోషన్స్ టైం.. ఈ తరానికి కన్నప్ప ఎవరంటున్న మంచు విష్ణు
Thalapathy 70 | దళపతి 70కు ప్లాన్.. విజయ్ ఏంటీ పవన్ కల్యాణ్ రూటులోనే వెళ్తున్నాడా..?