Allu Arjun Vs Prabhas | ఇద్దరూ పాన్ ఇండియా హీరోలే.. ఇద్దరూ యూత్‌లో క్రేజీ కథానాయకులే.. అయితే ఒకేసారి ఈ ఇద్దరూ పోటీపడితే.. ఇద్దరి సినిమాలు ఒకే నెలలో వస్తే ఎలా వుంటుంది? ఎస్..త్వరలో అలాంటి పోటీ ఈ మధ్య వుంటుదేమోనని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం పుష్ప-2. మైత్రీ మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోంది.
అల్లు అర్జున్-సుకుమార్ కలయికలో రూపొంది ఘనవిజయం సాధించిన పుష్ప దిరైజ్కు ఇది సీక్వెల్. అయితే మొదట్లో ఈచిత్రాన్ని ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. అయితే షూటింగ్, అండ్ పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్‌గా వుండటంతో డిసెంబర్ 6న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే తాజాగా ఈ చిత్రం మళ్లీ ఏప్రిల్ 10, 2025కు పోస్ట్ పోన్ అయ్యిందని ఊహగానాలు వినిపించాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ చిత్రం విడుదల ఏప్రిల్‌కు వాయిదా పడినట్లుగా ప్రచారం అవుతోంది. అయితే తాజాగా ప్రభాస్ (Prabhas ) మరో పాన్ ఇండియా చిత్రం రాజాసాబ్ గ్లింప్స్‌తో విడుదల చేయడంతో పాటు విడుదల తేదిని కూడా ప్రకటించారు నిర్మాతలు.
మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల ఏప్రిల్ 10న వుంటుందని ప్రకటించారు. హారర్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతుంది. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం విడుదల తేది ప్రకటించడంతో మళ్లీ పుష్ప-2 రిలీజ్ డేట్ హట్ టాపిక్‌గా మారింది. ఒక వేళ నిజంగానే పుష్ప-2 విడుదల తేది కూడా ఏప్రిల్ 10 లేదా ఆ నెలలోనే వుంటే రాజాసాబ్తో పోటీపడక తప్పదు. లేదంటే పుష్ప-2 డిసెంబరు 6నే పాత డేట్ ప్రకారమే రావాల్సి వుంటుంది. అలా కాకుండా ఒకే నెలలో అల్లు అర్జున్, ప్రభాస్‌లో వస్తే బాక్సాఫీస్ వద్ద ఓ ఆసక్తికరమైన పోటీ తప్పదు..!
Jailer 2 | రజినీకాంత్ జైలర్ 2లో నా క్యారెక్టర్ చాలా స్పెషల్.. యోగి బాబు కామెంట్స్ వైరల్
Mani Ratnam | అఫీషియల్.. కమల్‌హాసన్-మణిరత్నం థగ్ లైఫ్ టీంలోకి మరో ఇద్దరు యాక్టర్లు
Shah Rukh Khan | చికిత్స కోసం యూఎస్‌కు షారుఖ్‌ఖాన్..!
Thug life | డబ్బింగ్ స్టూడియోలో కమల్‌హాసన్.. థగ్ లైఫ్ టీం కొత్త వార్త ఇదే..!