టాలీవుడ్ స్టార్ హీరో జూ. ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Siva Koratala) డైరెక్షన్లో ఎన్టీఆర్ 30 ( NTR 30) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. అయితే హీరోయిన్ విషయంలో మాత్రం కొరటాల శివ టీం ఫైనల్ డెసిషన్‌కు రాకపోవడం ఇపుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. హీరోయిన్ (NTR 30 Heroine) ప్రకటన ఆలస్యమవుతున్న కొద్దీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
మొదట్లో కన్నడ సోయగం రష్మిక మందన్నా అని, మరోసారి సీతారామం హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ అని వార్తలు తెరపైకి వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారన్నది క్లారిటీ లేదు. ఈ రూమర్లకు చెక్ పడాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందేనంటున్నారు సినీ జనాలు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టు ఇది.
ఈ ఏడాది చివరికల్లా సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త భాగస్వామ్యంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్.ఎన్టీఆర్ 30కి రత్నవేల్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు. తారక్ మరోవైపు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ 31 కూడా చేస్తున్ విషయం తెలిసిందే.
Read Also : Conman Sukesh Case | మరో నలుగురు హీరోయిన్లకు ఖరీదైన కానుకలు..ఇంతకీ వాళ్లెవరు..?
Read Also : Ajay Devgn | అజయ్ దేవ్‌గన్‌పై కాంట్రవర్సియల్ ‘క్వీన్’ ప్రశంసలు
Read Also : Indian 2 | ఇండియన్ 2లో కమల్‌హాసన్ కొత్త ప్రయోగం..సెట్స్‌లో అంతా షాక్..!