Siddu Jonnalagadda | సిద్దుజొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా. నీరజ కోన డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీనిధి శెట్టి, రాశీఖన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేయగా నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
.ఈ మూవీ గురించి ప్రమోషనల్ ఈవెంట్లో ఆసక్తికర విషయం షేర్ చేసుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ.
తెలుసు కదా సినిమాలో ఎలాంటి కిస్ సీన్లు లేవన్నాడు సిద్దు జొన్నలగడ్డ. డైరెక్టర్ నీరజకోన తనకు స్క్రిప్ట్ వినిపించినప్పుడు.. ఈ సినిమాలో ఎలాంటి ముద్దు సన్నివేశాలను పెట్టొద్దని ఆమెకు సలహా ఇచ్చానన్నాడు. అయితే మూవీలో ఎలాంటి కిస్ సీన్లు లేనప్పటికీ ప్రీ ఇంటర్వెల్ సీన్ అలాంటి ఫీలింగ్‌నే కలగిస్తుందని.. మేం కథానుగుణంగా సినిమాలో భౌతిక (శారీరక) సాన్నిహిత్యం కాకుండా భావోద్వేగ సాన్నిహిత్యం, ఉండాలనుకున్నట్టు చెప్పాడు సిద్దు.
ఇందులో నేను రాడికల్ క్యారెక్టర్ (సామాజిక మార్పు కోరుకునే వ్యక్తి ) పోషించా. లీడ్ హీరో క్యారెక్టర్ వల్ల రాశీఖన్నా క్లైమాక్స్ షూట్ చేసేందుకు నో చెప్పింది. నా పాత్ర చాలా రాడికల్‌గా ఉంటుంది.. క్లైమాక్స్ సీన్‌ను షూట్ చేస్తున్నప్పుడు రాశీఖన్నా సెట్స్‌లో నుంచి వెళ్లిపోయింది. షూటింగ్ సుమారు 30-45 నిమిషాలపాటు ఆపేశాం. నిజజీవితంలో ఒక పాత్ర అలా ఎలా మాట్లాడుతుంది. తనకు ఒకవేళ అలాంటి బాయ్ ఫ్రెండ్ ఉంటే చంపేదాన్ని అని చెప్పింది. నువ్వు అంజలి పాత్రలో మాత్రమే నటిస్తున్నావు.. రాశీఖన్నా కాదు.. అని చెప్పానన్నాడు సిద్దు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read Also :
OG | థియేటర్లలో ‘ఓజీ’ ఘన విజయం ..ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌పై స్పెషల్ ఫోకస్..!
Ed Sheeran | ఇంటర్నేషనల్ కోలాబరేషన్.. బ్రిటీష్ పాప్ సింగర్‌తో సంతోష్ నారాయణన్ ఇండియన్ ఆల్బమ్
Tanuj Mouli | రూ. కోటి అడ్వాన్స్.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్.