Pankaj Tripathi | బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి స్టార్ నటుడిగా ఎదిగాడు. గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్, ఫుక్రే వంటి చిత్రాలు పంకజ్‌కు మంచి గుర్తింపు తీసుకురాగా.. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌తో ఆయన దశ తిరిగింది. క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఈ వెబ్ సిరీస్‌లో ఖాలీన్ భయ్యా పాత్రలో పంకజ్ నటన సిరీస్‌కే హైలైట్‌గా నిలిచింది. అయితే రీసెంట్గా ఈ వెబ్ సిరీస్ సీజన్ 3 విడుదలై రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. అయితే తన బాల్యంలో అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలని సైకిల్‌పై స్టంట్స్ వేసేవాడినని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న పంకజ్ తన బాల్యం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన బాల్యంలో అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలని సైకిల్‌పై స్టంట్స్ వేసేవాడినని ఎందుకంటే మా ఏరియాలో ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు ఇలా చేసే పాపులర్ అయ్యాడు. అప్పుడు నేను 8వ తరగతి అనుకుంటా మా స్కూల్లో సైకిల్ రేస్ జరిగింది. ఆ రేస్‌లో గెలిచిన అబ్బాయి అమ్మాయిల్లో బాగా పాపులర్ అయ్యాడు. అతడు గెలిచిన అనంతరం అమ్మాయిలందరూ తనను చుట్టుముట్టారు. అప్పుడే అనుకున్నాను. అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలంటే సైకిల్ రేస్ గెలవాలని కానీ అది అవ్వలేదు. ఇప్పుడు ఆలోచిస్తే నవ్వోస్తుంది.
చిన్నప్పుడు నేను ఈత నేర్చుకోవాలనుకున్నాను. మా ఇంటి పక్కనే నది ఉండేది. అయితే ఈత నేర్చుకోవాలంటే నదిలో ఉన్న నల్ల పురుగులను మింగితే ఈత తొందరగా వస్తుంది అని నాతో ఉన్నావాళ్లు చెప్పారు. నేను ఏం ఆలోచించకుండా ఆ పురుగులను మింగేశాను. అయితే అదృష్టం కొద్ది నా కడుపుకి ఏం కాలేదు. ఆ తర్వాత ఇలాంటివి చేయలేదు అంటూ పంకజ్ చెప్పుకోచ్చాడు.
Also Read..