బెల్లంకొండ బాలీవుడ్ వైపు అడుగులేయడానికి కారణం..

చాలా మంది బుర్రలో ఈ అనుమానం ఉందిప్పుడు. తెలుగులోనే ఇప్పటి వరకు స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకోలేదు. ఐదేళ్లుగా దానికోసమే కష్టపడుతున్నాడు. అప్పుడే బాలీవుడ్ వెళ్లాలనేంత ఆశ ఏంటి..? అది కాస్త ఓవర్ అనిపించడం లేదా అంటూ సోషల్ మీడియాలో బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీపై సెటైర్లు కూడా పేలుతున్నాయి. తెలుగులో ఇప్పటి వరకు ఈయన నటించిన సినిమాల్లో రాక్షసుడు మాత్రమే విజయం సాధించింది. అల్లుడు శీను, జయ జానకీ నాయకా సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ ఫ్లాప్స్ అయ్యాయి. దాంతో ఇప్పటికీ తెలుగులో సేఫ్ హీరోగా గుర్తింపు రాలేదు ఈయనకు. మరోవైపు టాలీవుడ్ లో స్టార్ హీరోలు కూడా బాలీవుడ్ అంటే మనకెందుకు వచ్చిన గోలరా బాబూ అంటూ వెనకడుగు వేస్తుంటారు.
రామ్ చరణ్, వెంకటేష్ లాంటి కొందరు ట్రై చేసి చేతులు కూడా కాల్చుకున్నారు. ఇలాంటి సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఇంత ధైర్యంగా ముందడుగు వేయడానికి ఆయన దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ కారణం. మరీ గుడ్డిగా ఆయన బాలీవుడ్ వెళ్లట్లేదు. తన సత్తా తెలుసు కాబట్టే వెళ్తున్నాడు. అర్థం కాలేదు కదా.. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పటికే హిందీ ఆడియన్స్ కు బెల్లంకొండ శ్రీనివాస్ ఎవరో తెలుసు.. ఆయన రేంజ్ గురించి ఐడియా ఉంది. ఈయన తెలుగు డబ్బింగ్ సినిమాలకు యూ ట్యూబ్ లో అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. 100 మిలియన్ వ్యూస్ కూడా వస్తున్నాయి. అక్కడ ఈయన డబ్బింగ్ సినిమాలకు కూడా 10 కోట్లకు పైగానే డిమాండ్ ఉంది.
అల్లుడు శీను, జయ జానకి నాయక లాంటి సినిమాలతో పాటు కవచం లాంటి డిజాస్టర్ సినిమాలు కూడా హిందీలో రచ్చ చేసాయి. అందుకే యూ ట్యూబ్ లో వచ్చిన గుర్తింపుతో మరో అడుగు ముందుకేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. మరోవైపు ఛత్రపతి లాంటి యాక్షన్ సినిమాతో వస్తే ఆ ఇంపాక్ట్ మరింత ఉంటుందని భావిస్తున్నాడు బెల్లంకొండ. వినాయక్ లాంటి మాస్ డైరెక్టర్ ను తీసుకోవడం వెనక కూడా కారణం అదే. తెలుగులో ఈయన్ని పరిచయం చేసింది వినాయకే. హిందీలో కూడా బెల్లంకొండను ఆయనే పరిచయం చేస్తుండటం విశేషం. మరి బెల్లంకొండ ఆశలు ఛత్రపతి రీమేక్ ఎంతవరకు నిలబెడుతుందో చూడాలిక.
తాజావార్తలు
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన శార్దూల్, సుందర్
- వాట్సాప్ కొత్త స్టేటస్ చూశారా?
- ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్
- బ్రిస్బేన్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత
- కర్నాటకలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న అమిత్‌షా
- డెంటల్ సీట్ల భర్తీకి అదనపు కౌన్సెలింగ్
- పొగమంచు ఎఫెక్ట్.. 26 రైళ్లు ఆలస్యం..
- రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు
- దేశంలో కొత్తగా 15,144 కరోనా పాజిటివ్ కేసులు
- మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు