శనివారం 28 నవంబర్ 2020
Cinema - Nov 22, 2020 , 20:52:07

తరుణ్, ప్రియమణి పెళ్లి ఆపేశారా..? కారణమేంటి...?

తరుణ్, ప్రియమణి పెళ్లి ఆపేశారా..? కారణమేంటి...?

ఏంటి తరుణ్, ప్రియమణి పెళ్లి చేసుకోవాలనుకున్నారా..? ఈ ఇద్దరి పెళ్లి సెటిల్ అయిందా.. మరి ఎందుకు ఆగిపోయింది ఎలా ఆగిపోయింది అనుకుంటున్నారా..? దీని వెనక అసలు కథ వేరే ఉంది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న తరుణ్ అంటే అమ్మాయిలకు ఫుల్ క్రేజ్ ఉండేది. హీరోయిన్లకు కూడా ఈయనపై క్రష్ ఉండేది. అంతేకాదు ఒకానొక టైమ్ లో ఈయన లవ్ ఎఫైర్స్ కూడా టాలీవుడ్ లో బాగానే ట్రెండ్ అయ్యాయి. మిలీనియం మొదట్లో ఇండస్ట్రీకి వచ్చిన తరుణ్.. వరస విజయాలతో స్టార్ అయ్యాడు. చాలా త్వరగా క్రేజ్ తెచ్చుకున్నాడు.. అయితే కెరీర్ లో చేసిన కొన్ని తప్పుల వల్ల అంతే త్వరగా క్రేజ్ కోల్పోయాడు. ఈయనకు ఇప్పటికీ 38 ఏళ్లు మాత్రమే. అయినా కూడా ఈయన్ని అంతా మరిచిపోయే స్టేజికి వచ్చేసారు ప్రేక్షకులు. 

ఇదిలా ఉంటే ఇప్పుడు తరుణ్ కు సంబంధించిన ఓ విషయం బయటికి వచ్చింది. ఈయన హీరోయిన్ ప్రియమణితో పెళ్లి పీటలెక్కాల్సిన వాడని.. కానీ అనుకోని కారణాలతో ఆ పెళ్లి ఆగిపోయిందని తెలిసింది. అప్పట్లో దివంగత హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కూడా ఈయన్ని పెళ్ళి చేసుకోవాలనుకుందని.. ఆయన నో చెప్పేసరికి ఆత్మహత్యాయత్నం కూడా చేసిందని జోరుగా ప్రచారం జరిగింది. ఆ వెంటనే ప్రియమణి సీన్ లోకి వచ్చింది. ఈ ఇద్దరూ కలిసి 2007లో నవవసంతం సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే చాలా క్లోజ్ అయిపోయారు ప్రియమణి, తరుణ్. కలిసి పార్టీలకు కూడా వెళ్లారు. 

తరుణ్ చాలా మంచి వ్యక్తి అని.. అందుకే తాను కూడా త్వరగా ఫ్రెండ్ అయిపోయానని చెప్పుకొచ్చింది ప్రియమణి. అదే సమయంలో కలిసి పార్టీలు కూడా చేసుకున్నామని చెప్పింది ఈ భామ. కానీ తమ మధ్య ఉన్న స్నేహాన్ని చూసి తరుణ్ తల్లి కూడా అపార్థం చేసుకుందని చెప్పుకొచ్చింది. ఇద్దరం ప్రమించుకుంటున్నామేమో అనుకుని ఒప్పుకుంటే పెళ్లి కూడా చేస్తానని చెప్పినట్లు గుర్తు చేసుకుంది. కానీ తమది స్నేహం మాత్రమే అని.. ప్రేమ కాదని తెలిసి తర్వాత అర్థం చేసుకున్నారని చెప్పింది ప్రియమణి. ఆ తర్వాత 2017లో ముస్తాఫా రాజ్‌ను పెళ్లి చేసుకుంది ప్రియమణి. పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తుంది ప్రియమణి. ప్రస్తుతం తెలుగులో వెంకటేష్ సరసన నారప్ప సినిమాలో నటిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.