భారత సినీ పరిశ్రమలో భారీ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా..? ఉన్నారా..? అంటే వెంటనే గుర్తొచ్చే భామ పూజాహెగ్డే (Pooja Hegde). తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది. ప్రస్తుతం పూజాహెగ్డే ఖాతాలో త్రివిక్రమ్-మహేశ్ బాబు సినిమా, సల్మాన్ ఖాన్ తో చేస్తున్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ (Kisi Ka Bhai Kisi Ka Jhan) చిత్రాలున్నాయి.
అయితే ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది పూజాహెగ్డే. కాలి మడమకు పట్టీ వేసుకున్న స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఫొటో చూస్తుంటే పూజాహెగ్డే మడమ నొప్పితో బాధపడుతున్నట్టు అర్థమవుతున్నా.. ఇంతకీ అసలు సమస్య ఏంటనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతానికి పూజాహెగ్డే చికిత్స చేయించుకుంటుందట. పూజాహెగ్డేకు షూటింగ్లో ఏమైనా గాయమైందా..? అని చర్చించుకుంటున్నారు ఈ ఫొటో చూసిన సినీ జనాలు.
మరి పూజాహెగ్డే కాలికి ఏమైందనే దానిపై రానున్న రోజుల్లో ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఈ బ్యూటీ మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ నటిస్తోన్న సర్కస్‌లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 23న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. కమర్షియల్ చిత్రాల డైరెక్టర్ రోహిత్ శెట్టి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
Read also : Saikumar | డైలాగ్ కింగ్ సాయికుమార్ 50 ఏండ్ల నట ప్రస్థానం.. ట్రెండింగ్‌లో స్టిల్
Read also : Venkat Prabhu | డైరెక్టర్ వెంకట్ ప్రభు-శివకార్తీకేయన్ కొత్త సినిమా అప్డేట్.. వీడియో