Venkat Prabhu | డైరెక్టర్ వెంకట్ ప్రభు-శివకార్తీకేయన్ కొత్త సినిమా అప్డేట్.. వీడియో
శివకార్తీకేయన్ (Sivakarthikeyan) నటిస్తున్న చిత్రం ప్రిన్స్ అక్టోబర్ 21న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే శివకార్తీకేయన్ కొత్త సినిమా అప్డేట్ను అందించాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు.
జాతిరత్నాలు ఫేం అనుదీప్ కేవీ దర్శకత్వంలో శివకార్తీకేయన్ (Sivakarthikeyan) నటిస్తున్న చిత్రం ప్రిన్స్. తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 21న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. శివకార్తీకేయన్ కొత్త సినిమా అప్డేట్ను అందించాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు. శివకార్తీకేయన్ ట్విటర్లో నెటిజన్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్లో పాల్గొన్నాడు.
ఈ సెషన్లో డైరెక్టర్ వెంకట్ ప్రభు (Venkat Prabhu)తాను నెక్ట్స్ శివకార్తీకేయన్‌తో సినిమా చేయబోతున్నట్టు పరోక్షంగా హింట్ ఇచ్చాడు. బ్రదర్ మనం ఎప్పుడు షూట్ చేస్తాం..అని కామెంట్ పెట్టాడు వెంకట్ ప్రభు. తాజా అప్డేట్ ప్రకారం ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్ మెంట్ నిర్మించనుంది.
వెంకట్ ప్రభు ప్రస్తుతం నాగచైతన్యతో సినిమా NC 22 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ప్రిన్స్ విడుదలైన తర్వాత వెంకట్ ప్రభు-శివకార్తీకేయన్ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఎలాంటి జోనర్లో సినిమా ఉండబోతుంది.. ఎప్పుడు సెట్స్‌పైకి తీసుకెళ్తారు.. తదితర విషయాలపై రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది.
తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న NC 22 చిత్రంలో ఉప్పెన ఫేం కృతిశెట్టి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లో వెన్నెల కిశోర్, ప్రేమ్గీ అమరేన్, సంపత్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Bro namma eppo shooting polaam?!apparam namba Anudeep ungala edhavadhu torture pannara #AskSK
— venkat prabhu (@vp_offl) October 19, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

