IT Raids | సినీ ప్రముఖుల నివాసాల్లో మంగళవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయని తెలిసిందే. వరుసగా మూడో రోజూ ఐటీ అధికారులు సోదాలు (IT Raids) చేపడుతున్నారు. ప్రముఖ నిర్మాత రాజు (Dil Raju) నివాసాలు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీసుతోపాటు మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలు, పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్‌తోపాటు దిల్ రాజు సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి ఇండ్లలోనూ.. దిల్ రాజు వ్యాపార భాగస్వాముల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం టీం స్పందించింది. ప్రొడ్యూసర్ మీద ఐటీ దాడులు జరిగే స్థాయికి ఈ సినిమా కలెక్షన్స్ రావడం గురించి రిపోర్టర్ ప్రశ్నించగా.. నిజమా.. ఐటీ దాడుల విషయం నాకు తెలియదని హీరో వెంకటేశ్ అన్నాడు. డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందిస్తూ.. ప్రతీ రెండేళ్లకోసారి ఐటీ దాడులు జరుగడం సహజం. దిల్ రాజుపైనే కాదు చాలా మంది ఇండ్లల్లో ఐటీ దాడుదలు జరిగాయి. సంక్రాంతికి వస్తున్నామని మేమంటే.. సంక్రాంతికి వస్తున్నామని ఐటీ వాళ్లు వచ్చారు. నా ఇంటిపై అయితే ఐటీ దాడులు జరుగలేదన్నాడు.
సుకుమార్ ఇంట్లో ఐటీ దాడుల గురించి అడుగగా.. సుకుమార్ ఇంటి పక్కన నేను లేను కాబట్టి ఐటీ అధికారులు రాలేదు. త్వరలోనే సుకుమార్ ఇంటి పక్కకు షిఫ్ట్ అవుతున్నాను. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి కచ్చితంగా వాళ్ళు వచ్చే అవకాశం ఉందంటూ చమత్కరించాడు అనిల్ రావిపూడి .
ఐటీ అధికారులు సినీ సంస్థలకు ఫైనాన్స్ చేస్తున్న వారి నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిర్మాత నెక్కంటి శ్రీధర్ నివాసంతోపాటు ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల ఇండ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.
ఐటీ సోదాలు నా ఒక్కడిపైనే జరుగడం లేదు: దిల్ రాజు
ఐటీ సోదాలు నా ఒక్కడిపైనే జరుగడం లేదని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇండస్ట్రీ మొత్తం సోదాలు కొనసాగుతున్నాయని తెలియజేశారు. తాను విజయ్‌తో తెరకెక్కించిన వారిసు (వారసుడు) సినిమా రూ.120 కోట్లు మాత్రమే వసూళ్లు చేసిందని దిల్ రాజు ఐటీ అధికారులకు చెప్పినట్టు తెలిసింది. అంతేకాదు విజయ్‌కు రూ.40 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చాం. ఈ సినిమాకు వచ్చిన నష్టాలను పూడ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు రూ.60 కోట్ల నష్టపరిహారం చెల్లించామని చెప్పినట్టు సమాచారం.
ఐటీ అధికారులు సోదాల్లో భాగంగా ఇప్పటికే దిల్ రాజు భార్య తేజస్వినిని బ్యాంక్‌కు తీసుకెళ్లారని తెలిసిందే. . బ్యాంకు వివరాలు కావాలని అధికారులు అడిగారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించామని తేజస్విని చెప్పారు.
Venkatesh | బ్రేక్ తీసుకొని వెకేషన్లో వెంకటేశ్.. ఇంతకీ ఇప్పుడెక్కడున్నాడో తెలుసా..?