Vicky Kaushal | మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఛావా (Chhaava). బాలీవుడ్ యాక్టర్ విక్కీకౌశల్ (Vicky Kaushal) టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా (Rashmika Mandanna)ఫీ మహారాణి యేసుబాయి పాత్రలో నటిస్తోంది.
ఔరంజేబు పాత్రలో ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా నటిస్తున్నాడు. ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో బిజీగా ఉంది విక్కీ కౌశల్ టీం. మూవీ సెట్స్‌లో ఎలాంటి వాతావరణం ఉండేదో చెబుతూ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు విక్కీ కౌశల్, లక్ష్మణ్ ఉటేకర్.
తన పాత్ర రియలిస్టిక్‌గా ఉండేందుకు సెట్స్‌లో ఎలా ఉండేవాడో చెప్పాడు విక్కీ కౌశల్. దీని గురించి విక్కీ కౌశల్ మాట్లాడుతూ.. మేమిద్దరం కలిసి కూర్చొని కనీసం టీ కూడా తాగలేదు. వెంటనే మా పాత్రల్లోకి లీనమైపోయేవాళ్లం. సెట్స్‌లో ఉన్నప్పుడు కూడా అక్షయ్ ఖన్నాతో అసలు మాట్లాడేవాడిని కాదు. సాధారణంగా ఇద్దరి మధ్య ఇంటరాక్షన్ జరుగలేదు. కానీ ఆయనతో సినిమా విడుదలైన తర్వాత అయినా మాట్లాడుతాననుకుంటున్నానంటూ చెప్పుకొచ్చాడు విక్కీ కౌశల్.
లక్ష్మణ్ ఉటేకర్ ఇదే విషయం గురించి చెబుతూ.. వ్యక్తిగతంగా వాళ్లద్దరూ షూటింగ్‌కు ముందెప్పుడూ కలవలేదు. విక్కీ కౌశల్, అక్షయ్ ఖన్నా కేవలం షూటింగ్ టైంలోనే మాట్లాడుకునేవాళ్లు. అది కూడా కేవలం వాళ్ల పాత్రలకు సంబంధించినంత వరకు మాత్రమే. వాళ్లిద్దరూ తమ పాత్రల్లో లీనమై ఒకరి ముఖాలు కూడా ఒకరు చూసుకోవడానికి ఇష్టపడలేదంటూ చెప్పుకొచ్చాడు.
Read Also :
L2 Empuraan | తొలి సినిమాగా.. రిలీజ్‌కు ముందే మోహన్ లాల్ L2E అరుదైన రికార్డ్
Sairam Shankar | విలన్ ఎవరో చెప్పండి.. రూ.10 వేలు గెలుచుకోండి.. సాయి రామ్ శంకర్ బంపర్ ఆఫర్