బుధవారం 08 జూలై 2020
Cinema - May 28, 2020 , 14:24:56

మా ఇద్ద‌రిలో ఎవ‌రి కాస్ట్యూమ్ బాగుంది: వార్న‌ర్‌

మా ఇద్ద‌రిలో ఎవ‌రి కాస్ట్యూమ్ బాగుంది:  వార్న‌ర్‌

క‌రోనా వ‌ల‌న ప్ర‌జ‌ల‌కి వినోదం పూర్తిగా క‌రువైంది. ఇటు సినిమాలు అటు క్రీడ‌లకి పూర్తిగా బ్రేక్ ప‌డ‌డంతో అందరు చాలా బోరింగ్‌గా ఫీల‌వుతున్నారు. అయితే ఇలాంటి సంద‌ర్భాల‌లో మ‌న సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ని ఉత్సాహ‌ప‌రుస్తూ వ‌స్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్ర‌ముఖ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ బ్యాట్‌తో కాకుండా డ్యాన్స్‌, యాక్టింగ్‌తో అల‌రిస్తూ వ‌స్తున్నాడు.

ఇటీవ‌ల డేవిడ్ వార్నర్ బాహుబ‌లి చిత్రంలో ప్రభాస్ డైలాగ్‌కి టిక్ టాక్ వీడియో చేశాడు. ఇందులో భాగంగా ప్ర‌భాస్ మాదిరి కాస్ట్యూమ్ ధ‌రించి అద‌ర‌గొట్టాడు. ఈ వీడియోకి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా బాహుబలి చిత్రంలోని ప్రభాస్ ఫొటో పక్కన ఆయన ఫోటో పోస్ట్ చేసి ఎవరి కాస్ట్యూమ్ బాగుంది అని నెటిజెన్స్ కి పోల్ పెట్టాడు. దీంతో నెటిజ‌న్స్‌కి ఎవరికి ఓటేయ్యాలో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. 


logo