టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వాల్తేరు వీరయ్య షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే చిరంజీవి ఇటు ఫ్యామిలీ యాత్ర.. అటు విహారయాత్ర అంటూ శృతిహాసన్, ఫ్యామిలీతో కలిసి దిగి షేర్ చేసిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ చిరంజీవి ఎక్కడికెళ్లి ఉంటాడని తెగ ఆలోచించడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చేశాడు చిరు.
వాల్తేరు వీరయ్య రిపోర్టింగ్ ఫ్రమ్ ఫ్రాన్స్ అంటూ ..హాయ్ ఫ్రెండ్స్ నేను ఫ్రాన్స్ నుంచి మాట్లాడుతున్నా. ఈ నెల 12వ తారీఖున శృతిహాసన్‌తో నేను చేసిన పాట పూర్తయిపోయింది. విజువల్స్ , సాంగ్ చాలా ఎక్జయిటింగ్ అనిపించింది..మేం షూట్ చేసిన లొకేషన్స్ చాలా అందంగా ఉన్నాయి.. త్వరలో లిరికల్ వీడియో మీ ముందుకురాబోతుంది. మీరు ఎంజాయ్ చేస్తారు. మీకు లీక్ చేస్తున్నా.. అని నువ్వు శ్రీదేవైతే.. నేనే చిరంజీవైతా సాంగ్ బిట్‌ను అందరితో పంచుకున్నాడు చిరంజీవి. ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య (Waltair Veerayya)లో రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా సందడి చేయబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
వాల్తేరు వీరయ్య రిపోర్టింగ్ వీడియో..
Read Also : Ram Charan | ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాంచరణ్‌కు ఆహ్వానం.. వివరాలివే
Read Also : MM Keeravani | మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇంట విషాదం..
Read Also : Aadhi Pinishetty | ఆది పినిశెట్టి బర్త్ డే స్పెషల్.. శబ్దం లుక్ రిలీజ్