టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. రాంచరణ్-ఉపాసన దంపతులు చిన్నారికి స్వాగతం పలుకబోతున్నారన్న వార్తను మెగా అభిమానులు వేడుకగా జరుపుకుంటున్నారు. కాగా రాంచరణ్‌కు భక్తిభావం ఎక్కువని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆధ్యాత్మిక కార్యక్రమానికి రావాల్సిందిగా తాజాగా ఈ స్టార్ హీరోకు ఆహ్వానం అందింది. అహ్మదాబాద్‌లో జరుగనున్న ప్రముఖ్ స్వామి మహారాజ్ శతాబ్ధి జన్మదిన (Pramukh Swami Maharaj) వేడుకలకు రావాల్సిందిగా రాంచరణ్‌కు ఆహ్వానం అందించారు.
డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు కొనసాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రధాన మోదీ కూడా హాజరుకానున్నారు. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఆర్సీ 15 న్యూజిలాండ్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుని.. హైదరాబాద్‌కు చేరుకున్నాడు రాంచరణ్. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర, సునీల్, జయరాయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో దిల్ రాజు, శిరీష్ తెరకెక్కిస్తున్నారు. ఆర్సీ 15 చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా..సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. రాంచరణ్ మరోవైపు ఉప్పెన ఫేం బుచ్చి బాబు సాన దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు.
Our #MegaPowerStar @AlwaysRamCharan garu is Invited for the #PSM100 in Ahmedabad (A Spiritual Event)
India's PM Shri @narendramodi Ji, Mukesh Ambani & Others are also Invited for the Event along With Idol RamCharan garu ❤️🏹#ManOfMassesRamCharan #RamCharan pic.twitter.com/F1ECo2sbBa
— SivaCherry (@sivacherry9) December 13, 2022
Read Also : Balakrishna | మోక్షజ్ఞ నామకరణం ఈ థియేటర్లోనే చేశారు : బాలకృష్ణ
Read Also : Waltair Veerayya | వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు టైం ఫిక్స్.. ప్రకటనే తరువాయి..!
Read Also : Aadhi Pinishetty | ఆది పినిశెట్టి బర్త్ డే స్పెషల్.. శబ్దం లుక్ రిలీజ్