Aadhi Pinishetty | ఆది పినిశెట్టి బర్త్ డే స్పెషల్.. శబ్దం లుక్ రిలీజ్
నేడు 40వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించాడు ఆదిపినిశెట్టి. అరివజగన్ వెంకటాచలం (Arivazhagan Venkatachalam) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శబ్దం (Sabdham) టైటిల్ను ఫైనల్ చేశారు.
తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్ ఆది పినిశెట్టి (Aadhi Pinishetty). నేడు 40వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించాడు ఆదిపినిశెట్టి . వైశాలి సినిమాతో ఆదిపినిశెట్టికి బ్లాక్ బస్టర్ హిట్టు అందించిన అరివజగన్ వెంకటాచలం (Arivazhagan Venkatachalam) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి శబ్దం (Sabdham) టైటిల్ను ఫైనల్ చేశారు. ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను అందరితో పంచుకుంది ఆది అండ్ మేకర్స్ టీం.
చెవిని హైలెట్ చేస్తూ రిలీజ్ చేసిన లుక్ కొత్తగా కనిపిస్తూ.. సినిమాపై అందరిలో ఆసక్తిని కలగజేస్తుంది. మేం నేడు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాం. మీ ఆశీస్సులు కావాలి. ఎప్పుడూ వినని శబ్ధం..అని తెలుగు, తమిళ పోస్టర్లను ట్వీట్ చేశాడు ఆదిపినిశెట్టి . హార్రర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 7జీ ఫిలిమ్స్ అండ్ అల్ఫా ఫ్రేమ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఎస్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
పర్ఫార్మెన్స్ కు ఆస్కారముంటే చాలు విలన్ రోల్ కూడా చేసేందుకు ఎప్పుడూ రెడీ ఉంటాడు ఆదిపినిశెట్టి. ఈ ఏడాది రామ్ హీరోగా నటించిన ది వారియర్లో విలన్గా నటించాడు ఆదిపినిశెట్టి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయినా.. నటన పరంగా ఆదిపినిశెట్టికి మంచి మార్కులే పడ్డాయి.
శబ్దం లుక్ షేర్ చేసిన ఆదిపినిశెట్టి..
Need all your best wishes as we begin this new journey today🙏🏼#SABDHAM – The sound that's never heard!
Team #Eeram reunites!@dirarivazhagan @MusicThaman @7GFilmsSiva @Aalpha_frames @Dop_arunbathu @EditorSabu @Manojkennyk @stunnerSAM2 @Viveka_Lyrics @Synccinema pic.twitter.com/rgU5UY43VR— Aadhi🎭 (@AadhiOfficial) December 14, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

