RCBW vs UPWW : మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరు కొనసాగుతోంది. తొలిపోరులో ఫినిషర్ డీక్లెర్క్ మెరుపులతో గెలుపొందిన ఆర్సీబీ.. ఈసారి ఏకపక్ష పోరులో యూపీ వారియర్స్‌ను 9 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 143 పరుగుల ఛేదనలో ఓపెనర్లు గ్రేస్ హ్యారిస్(85) పవర్ ప్లేలోనే అర్ధ శతకంతో విరుచుకుపడింది. గెలుపువాకిట ఈ చిచ్చరపిడుగు ఔటైనా.. స్మృతి మంధాన(47 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ముగించింది. సమిష్టి వైఫల్యంతో యూపీ జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.
రెండో సీజన్ విజేత ఆర్సీబీ ఛాంపియన్ ఆటతో రెండో విక్టరీ కొట్టింది. డీవై పాటిల్ మైదానంలో బౌలర్ల విజృంభణతో యూపీ వారియర్స్‌ను తక్కువకే కట్టడి చేసిన బెంగళూరు మోస్తరు లక్ష్యాన్ని ఉఫ్‌మనిపించింది. యూపీ నిర్దేశించిన 144 పరుగుల ఛేదనను ఆర్సీబీ ఓపెనర్లు దూకుడుగా ఆరంభించారు.
Some more Grace Harris SIXES 💥💥
What an outing for the @RCBTweets opener!
Updates ▶️ https://t.co/U1cgf01ys0#TATAWPL | #KhelEmotionKa | #RCBvUPW pic.twitter.com/VSBfPRUxk0
— Women’s Premier League (WPL) (@wplt20) January 12, 2026
పవర్ ప్లేలోనే గ్రేస్ హ్యారిస్(85) బౌండరీలతో విరుచుకుపడింది. కెప్టెన్ స్మృతి మంధాన(47 నాటౌట్) నిదానంగా ఆడగా..హ్యారిస్ మాత్రం ధనాధన్ ఆటతో యూపీ వారియర్స్ బౌలర్లను వణికించింది. డియాండ్ర డాటిన్ ఓవర్లో రెచ్చిపోయిన హ్యారిస్ వరుసగా 6, 4, 6, 6 బాది అర్ధ శతకం పూర్తి చేసుకుంది. పవర్ ప్లేలోనే యాభై కొట్టిన నాలుగో ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత ఈ ద్వయాన్ని విడదీసేందుకు యూపీ కెప్టెన్ లానింగ్ బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు శిఖా పాండే ఓవర్లో హ్యారిస్ కవర్స్‌లో చిక్కింది. దాంతో. 137 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటికే ఆర్సీబీ విజయం ఖరారైంది. ఆ తర్వాత వచ్చిన రీచా ఘోష్(4 నాటౌట్)తో కలిసి మంధాన లాంఛనం పూర్తి చేసింది.
టాస్ ఓడిన యూపీ వారియర్స్‌ను బెంబేలెత్తిస్తూ లారెన్ బెల్(1-13) వికెట్ల వేట మొదలెట్టింది. ఓపెనర్ హర్లిన్ డియల్ను వెనక్కి పంపి తొలి బ్రేకిచ్చింది .అనంతరం.. శ్రేయాంక పాటిల్ ఓవర్లో కెప్టెన్ మేగ్ లానింగ్(14) రాధా యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది. బౌండరీలతో ఆర్సీబీ బౌలర్లపై ఒత్తిడి పెంచాలనుకున్న డేంజరస్ ఫొబే లిచ్‌ఫీల్డ్(20)ను శ్రేయాంక డగౌట్ చేర్చింది.
Innings Break!
A revival act by Deepti Sharma and Deandra Dottin after #RCB bowlers were on fire early on! 👌
Run chase coming 🆙 ⌛
Scorecard ▶️ https://t.co/U1cgf01ys0 #TATAWPL | #KhelEmotionKa | #RCBvUPW pic.twitter.com/P3ppMlDPja
— Women’s Premier League (WPL) (@wplt20) January 12, 2026
స్వల్ప వ్యవధలో మూడు వికెట్లు పడడంతో కష్టాల్లో కూరుకుపోయిన యూపీని నదినే డీక్లెర్క్(2-2) మరింత దెబ్బతీసింది. తను ఒకే ఓవర్లో వరుసగా కిరణ్ నవగరి(5), శ్వేతా షెహ్రావత్(0)లను వెనక్కి పంపింది. దాంతో.. 50కే యూపీ జట్టు సగం వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లకు స్కోర్.. 56-5. పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును డియాండ్ర డాటిన్(40 నాటౌట్) దీప్తి శర్మ(45 నాటౌట్) ఆదుకున్నారు. ఆర్సీబీ బౌలర్లను దీటుగా ఎదర్కొన్న వీరిద్దరు అజేయంగా 93 రన్స్ జోడించారు. దాంతో.. యూపీ నిర్ణీత ఓవర్లలో 143 పరుగులు చేసింది.