హైదరాబాద్‌లో ప్రఖ్యాతి గాంచిన థియేటర్లలో ఒకటి తారకరామ (Tarakarama). ఈ థియేటర్‌ను ‘ఏషియన్ తారకరామ’ (Asian Tarakarama) పేరుతో నూతన హంగులతో సిద్దం చేసిన విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఇవాళ ఏషియన్ తారకరామ థియేటర్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని మా తల్లి జ్ఞాపకార్థం కట్టాం. ఆ ఆస్పత్రి మాకో దేవాలయం. అలాగే ఈ థియేటర్ కూడా మాకు దేవాలయంతో సమానం. అమ్మానాన్నల పేర్లతో ఏర్పాటు చేసిన ఈ థియేటర్‌ను 1978లో ప్రారంభించాం. అక్బర్ సలీం అనార్కలి సినిమాతో ఈ థియేటర్ ప్రయాణం మొదలైంది. అయితే కొన్ని అనివార్యకారణాల వల్ల నిలిచిపోయిన తారకరామ థియేటర్‌ను 1995లో మళ్లీ ప్రారంభించాం. ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త హంగులతో మూడోసారి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
ఈ మూవీ థియేటర్‌కు ఓ చరిత్ర ఉంది. తారకరామలో డాన్ సినిమా 525 రోజులు ఆడింది. అంతేకాదు నా సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ థియేటర్ నాకు సెంటిమెంట్. నా కుమారుడు మోక్షజ్ఞ తారక రామ తేజ పేరును నాన్న ఈ థియేటర్లోనే పెట్టారు. మాకు ఏషియన్ సినిమాస్ సంస్థతో మంచి అనుబంధం ఉంది. వారితో కలిసి ఏషియన్ తారకరామను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉందన్నాడు బాలకృష్ణ. ఈ థియేటర్లో డిసెంబర్ 16 నుంచి అవతార్2 స్క్రీనింగ్ కానుంది.
ఏషియన్ తారకరామ ప్రత్యేకతలు..
4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్, సీటింగ్ మార్పులు..
ఉత్తమ అనుభూతి కలిగించేందుకు సీటింగ్ కెపాసిటీ 975 నుంచి 590కి తగ్గింపు..
రెక్లైనర్ సోఫాల ఏర్పాటు..
#NataSimhamNandamuriBalakrishna #NBK #NandamuriBalakrishna From Grand Asian TarakaRama Theatre Re-Opening At Kachiguda , Hyderabad 🎉💐💫. (2) pic.twitter.com/kSxN17XY3A
— BA Raju's Team (@baraju_SuperHit) December 14, 2022
Read Also : Ram Charan | ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాంచరణ్‌కు ఆహ్వానం.. వివరాలివే
Read Also : Waltair Veerayya | వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు టైం ఫిక్స్.. ప్రకటనే తరువాయి..!
Read Also : Aadhi Pinishetty | ఆది పినిశెట్టి బర్త్ డే స్పెషల్.. శబ్దం లుక్ రిలీజ్