Waltair Veerayya | బాలకృష్ణ, విజయ్‌లకు సైడ్ ఇచ్చిన చిరు.. ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ ఆ రెండు చిత్రాల తర్వాతే?
Waltair Veerayya Release Date | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఓ మెగా కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నా.. విజయాలు మాత్రం అందుకోలేకపోతున్నాడు.
Waltair Veerayya Release Date | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఓ మెగా కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నా.. విజయాలు మాత్రం అందుకోలేకపోతున్నాడు. ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత ఈయన నటించిన ‘సైరా’, ‘ఆచార్య సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ పరాజయాలుగా మిగిలాయి. ప్రస్తుతం చిరు ఆశలన్ని ‘వాల్తేరు వీరయ్య’ పైనే ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. అయితే రిలీజ్ డేట్‌పై ఎలాంటి క్లారిటీ లేదు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. వాల్తేరు వీరయ్య చిత్రాన్ని జనవరి 13న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’, విజయ్ ‘వారసుడు’ సినిమాలు కూడా సంక్రాంతికే రిలీజ్ కానున్నాయి. దాంతో ఆయా చిత్ర నిర్మాతలు చర్చలు జరిపి ఒకే రోజు సినిమాలు రిలీజ్ కావడం మంచిది కాదని, ఒకటి, రెండు రోజులు ముందు వెనక్కి జరగాలని నిర్ణయించుకున్నట్లు టాక్. దాంతో వాల్తేరు వీరయ్య చిత్రాన్ని జనవరి 13కు లాక్ చేసినట్లు తెలుస్తుంది. కాగా మిగితా రెండు చిత్రాలు వాల్తేరు వీరయ్య కంటే ముందే రిలీజ్ కానున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని మైత్రీ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో చిరంజీవి యూనియన్ లీడర్‌గా కనిపించనుండగా.. రవితేజ పోలీస్ ఆధికారిగా కనిపించనున్నాడు. చిరుకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది.
Read Also:
Allu Arjun-Trivikram | ఆ హిట్ కాంబో మళ్లీ రిపీట్ కానుందా.. సినీ ప్రియులకు పండగే..!
‘NTR30’ స్టోరీ లైన్ ఇదేనా.. కొరటాల శివ అలాంటి అంశాలను టచ్ చేస్తున్నాడా?
Ori Devuda Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘ఓరి దేవుడా’.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?
Siva Karthikeyan | శివ కార్తికేయన్ సినిమాలో టాలీవుడ్ స్టార్ కమెడీయన్?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

